
‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో మెప్పించిన వివేక్ అగ్నిహోత్రి.. తర్వాత ‘ది ఢిల్లీ ఫైల్స్’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్‌ను మార్చినట్టు మంగళవారం ప్రకటించారు. ఈ సినిమాను ‘ది బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్’గా తెరకెక్కిస్తున్నట్టు మంగళవారం అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ది ఢిల్లీ ఫైల్స్ ఇప్పుడు ది బెంగాల్ ఫైల్స్‌గా రాబోతోందని చెబుతూ ఈనెల 12న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు వివేక్. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, గోవింద్ నామ్‌దేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. పల్లవి జోషి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.