ఎల్ నినో కాలంలో ప్రతి ఒక్కరు నీటిని, కరెంటును పొదుపుగా వాడాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆదివారం ( అక్టోబర్ 18 ) మంత్రి వివేక్ నివాసంలో మందమర్రి పట్టాన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఓలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ నినో ప్రభావం తో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు తప్పవని... ప్రతి ఒక్కరు త్రాగు, సాగునీరుతో పాటు విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని అన్నారు మంత్రి వివేక్.
ప్రకృతి విధ్వంసాలను కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం విడ్డూరమని అన్నారు. ఎల్ నినో ప్రభావం తో నేను కూడా నీటిని పొదుపు గా వాడుకుంటున్నానని...విద్యుత్ ను కూడా ఆదా చేస్తున్నానని అన్నారు మంత్రి వివేక్. ఎల్ నినో నేపధ్యంలో ప్రతిఒక్కరు పొదుపును పాటించాలని... ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు మంత్రి వివేక్.
కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికే చెక్కుచెదరలేదని... బీఆర్ఎస్ హయాంలో లక్ష కోట్లతో కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కుంగిందని అన్నారు. నాణ్యత లోపం,అవకతవకలే కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు మంత్రి వివేక్. మేడిగడ్డ పంపులు ఆన్ చేయాలంటున్న కేటీఆర్ బ్యారేజ్ ఎందుకు నిర్మించారు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి వివేక్. ప్రాణహిత చేవెళ్ల నిర్మిస్తే తాగు సాగునీరుకి ఇబ్బందులు ఉండకపోతుండేనని అన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు 20 ఎకరాల భూమి ఉంటే పదేళ్లలో 300 ఎకరాలు అక్రమంగా ఎలా సంపాదించుకున్నారని ప్రశ్నించారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం వేలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించారని అన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి 50 కోట్ల ప్రజా ధనంతో ప్రత్యేక కాలువలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లను తెప్పించుకున్నారని అన్నారు.
2016కు ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదురుగా చెరువే లేదని...కానీ 58 ఎకరాలలో పాండురంగ చెరువును తవ్వించి మోటార్ల ద్వారా ఫాం హౌస్ నుండి పంట పొలాలకు నీళ్లను మళ్లించుకున్నారని అన్నారు. ఇందులో 50 కోట్ల ప్రజాధనం తన సొంతానికి వాడుకున్నాడని... ఏకంగా మూడు ఎకరాల బావిని తవ్వి తన భూములనే బంగారంగా మార్చుకొని తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాడని అన్నారు మంత్రి వివేక్.
వంద కేసులు ఉన్న బాల్క సుమన్ కు వంద కోట్లు ఎలా వచ్చాయని.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 కోట్లను ఖర్చు చేశాడని అన్నారు. బాల్క సుమన్ అఫిడఫిట్ ను ప్రజలు గమనించాలని అన్నారు మంత్రి వివేక్.
