సిద్దిపేటలో కేసీఆర్ 12 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టారు... మా ప్రభుత్వం వచ్చాక 12 వేల ఇందిరమ్మ ఇళ్ళు కట్టాం: మంత్రి వివేక్

సిద్దిపేటలో కేసీఆర్ 12 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టారు... మా ప్రభుత్వం వచ్చాక 12 వేల ఇందిరమ్మ ఇళ్ళు కట్టాం: మంత్రి వివేక్

కేసీఆర్ హయాంలో సిద్దిపేటలో 12 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మాత్రమే కడితే.. తమ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే 12 వేల ఇందిరమ్మ ఇళ్ళు కట్టించమని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం ( అక్టోబర్ 16 ) సిద్ధిపేటలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్  కు ఉద్యమం సమయంలో ఆస్తులు ఎలా పెరిగాయని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రశ్నించారని.. కేసీఆర్ సీఎం అయ్యాక పదేళ్లలో ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయి అన్నది సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారని అన్నారు మంత్రి వివేక్. 

ALSO READ : కార్ల తయారీ పరిశ్రమలకు హైదరాబాద్ బెస్ట్ ప్లేస్: సీఎం రేవంత్

తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కు 22 ఎకరాలు ఉంటే.. ఉదయమ సమయంలో 42 ఎకరాలు కొన్నాడని అన్నారు.ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక 330 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.