చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వైభవంగా విజయదశమి వేడుకలు... కుటుంబసమేతంగా పాల్గొన్న మంత్రి వివేక్ 

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వైభవంగా విజయదశమి వేడుకలు... కుటుంబసమేతంగా పాల్గొన్న మంత్రి వివేక్ 

మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం ( అక్టోబర్ 20 ) నిర్వహించిన ఈ వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొన్నారు మంత్రి వివేక్  వెంకటస్వామి. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శమీ పూజ (జమ్మి పూజ) చేసి బంగారం వంటి జమ్మి ఆకులను మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్న మంత్రి కుటుంబ సభ్యులు.

ఈ క్రమంలో క్యాంపు ఆఫీసుకు భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వివేక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు మంత్రి వివేక్. నియోజకవర్గ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మంత్రి వివేక్.