పాస్టర్ల సమస్యలు పరిష్కారిస్తాం: వివేక్ వెంకటస్వామి

పాస్టర్ల సమస్యలు పరిష్కారిస్తాం: వివేక్ వెంకటస్వామి

పాస్టర్ ల సమస్యలు పరిష్కారిస్తామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను గెలవాలని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఫాస్టర్స్ తమ వంతు ప్రయత్నం చేశారని.. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రభువు ప్రవచనాలను ఫాస్టర్లు ప్రజల్లోకి తీసుకువెళ్లి.. సమాజం సన్మార్గంలో నడిచేలా చేస్తున్నారని చెప్పారు.

మంచిర్యాల జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటనకు వెళ్లారు. గోపాల్ వాడలో షారోను ప్రార్థన మందిరానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలకు గజమాలతో ఫాస్టర్లు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ప్రార్థనలు చేశారు.