బ్రూస్ లీని ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

బ్రూస్ లీని ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

పంజాగుట్ట, వెలుగు: క్రమశిక్షణ, నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం కరాటేలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్​కు అటెంప్ట్ చేసిన ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులకు ఆయన విన్నింగ్ టిప్స్ చెప్పారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, కరాటే, మార్షల్ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ రంగాల్లో బ్రూస్ లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 

జీవితంలో ఎంత ఎదిగినా, ఎన్ని పతకాలు సాధించినా పెద్దల పట్ల, ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందని తెలిపారు. అంతకుముందు మంత్రికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికి, సత్కరించారు. అనంతరం అకాడమీ అధ్యాపకులను, సిబ్బందిని మంత్రి వివేక్ అభినందించారు.