చెన్నూరులో షాపింగ్ మాల్ను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో షాపింగ్ మాల్ను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాజ రాజేశ్వరి షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి షాపింగ్ మాల్ యాజమాన్యం శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. నూతనంగా ప్రారంభించిన ఈ షాపింగ్ మాల్ కస్టమర్లతో కిటకిటలాడుతోంది. 

అనంతరం చెన్నూర్ పట్టణంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీల విజేతలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బహుమతులు ప్రధానం చేశారు. ఆ తర్వాత చెన్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

మరోవైపు మంచిర్యాల జిల్లా కోటపళ్లి మండలం కొల్లూరు గ్రామంలో ఇటీవలే చనిపోయిన జంగ అశోక్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.