చెన్నూరు ఎన్నికల ప్రచారంలో సరోజావివేక్

చెన్నూరు ఎన్నికల ప్రచారంలో సరోజావివేక్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం కిష్టాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ. కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ ని గెలిపించాలని కోరారు. గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో ఆమెకు స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు సరోజా. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తోందన్నారు సరోజావివేక్. 

 చెన్నూరులో కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి బరిలోకి దిగుతుండగా..బీఆర్ఎస్ నుంచి  బాల్కసుమన్ ..బీజేపీ నుంచి దుర్గం అశోక్ పోటీ చేస్తున్నారు.  కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తున్నారు. వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ కూడా చెన్నూరులో  ప్రచారం చేస్తున్నారు.