
ఇండియాలో ప్రముఖ టెలికం ఆపరేటర్ వొడాఫోన ఐడియా (Vi) తన సేవలను మరింత మెరుగుపర్చేందుకు సిద్దమైంది. కొత్త టెక్నాలజీలో దేశంలో మొబైల్ నెట్ వర్క్ లేని మారు మూల ప్రాంతాల్లో కూడా స్పేస్ నెట్ వర్క్ తో కలిసి ఆడియో, వీడియో కాల్స్ చేసుకునేలా వొడాఫోన్ ఐడియా తన సేవలను విస్తరిస్తోంది.
వొడోఫోన్ ఐడియా(Vi), AST స్పేస్ మొబైల్ భాగస్వామ్యంతో ఇప్పుడున్న మొబైల్ నెట్ వర్కుల అవసరం లేకుండా డైరెక్టుగా ఉపగ్రహ కనెక్టివిటీ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సరికొత్త సర్వీస్ను త్వరంలో ప్రారంభించనుంది.
ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో పోటీపడుతున్న ఉపగ్రహ కమ్యూనికేషన్ సంస్థ AST స్పేస్‌మొబైల్ ఓ ప్రత్యేక స్పేస్-ఆధారిత సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ నెట్ వర్క్ ను ప్రామాణిక మొబైల్ ఫోన్ల ద్వారా నేరుగా యాక్సెస్ చేయొచ్చు.
వొడాఫోన్ (Vi), AST స్పేస్‌మొబైల్ సంస్థతో కలిసి దేశమంతటా అన్ని ప్రాంతాల్లో అంటే మొబైల్ నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో కూడి ప్రాంతాలలో మొబైల్ కనెక్టివిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
AST స్పేస్‌మొబైల్ దాని సరికొత్త టెక్నాలజీతో సాధారణ మొబైల్ ఫోన్ ద్వారా అంతరిక్షం నుంచి మొట్టమొదటి వాయిస్ , వీడియో కాల్‌ను అందించి చరిత్ర సృష్టించనుందని కంపెనీ చెబుతోంది. Vodaphone Idea ప్రమోటర్ సంస్థ Vodafone Plc ఇప్పటికే AST SpaceMobileతో ఒప్పందంపై సంతకం చేసింది.
స్పేస్ ఆధారంగా వాయిస్ కాల్
AST స్పేస్ మొబైల్ సంస్థ మొబైల్ ఫోన్ల ద్వారా స్పేస్ ఆధారంగా వాయిస్ కాల్స్ చేయడంలో సక్సెస్ అయింది. జూన్ 2023లో మొట్టమొదటి 4G డైన్ లోడ్ వేగాన్ని 10Mbps కంటే ఎక్కువగా సాధించింది. ఆ తర్వాత 2023 సెప్టెంబర్ లో మొదటి 5G వాయిస్ కాల్ చేసింది.
అంతరిక్షం డైరెక్ట్ 4G ,5G సేవలు
Vi ,AST స్పేస్‌మొబైల్ భాగస్వామ్యంతో AST స్పేస్‌మొబైల్ లేటెస్ట్ స్పేస్ సెల్యూలార్ టెక్నాలజీతో అనుసంధానం చేయడం ద్వారా Vi నెట్‌వర్క్ మరింత మెరుగుపడనుంది. దీనికి కనెక్టివిటీ కోసం ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేదా సాఫ్ట్‌వేర్ అవసరం లేదు. SpaceMobile శాటిలైట్ సిస్టమ్‌పై పనిచేయనుంది. ఇది వాయిస్, వీడియో, డేటా స్ట్రీమింగ్ ,ఇంటర్నెట్ యాక్సెస్‌తో సహా Vi టెలికాం ఆఫర్ల మరింత మెరుగుపర్చనుంది.