Valentine Week:  ఒక్క హగ్.. ఎంతో బలం.. కొత్త ఉత్సాహం.. ఆ అనుభూతే వేరు..!

Valentine Week:  ఒక్క హగ్.. ఎంతో బలం.. కొత్త ఉత్సాహం.. ఆ అనుభూతే వేరు..!

సంతోషాన్ని రెట్టింపు చేసేది.. బాధను తగ్గించేది ఏదైనా ఉందీ అంటే అది ఇష్టమైన వాళ్ల కౌగిలే! ఇష్టమైన వ్యక్తిని హత్తుకుంటే కలిగే ఫిలింగ్​ ను దేనితోనూ కొనలేం. అందులో కేరింగ్, సపోర్ట్ అన్నీ ఉంటాయి. ప్రేమలోని ఆ మధురమైన అనుభూతిని ఆస్వాదించేందుకే ఈ హగ్ డే!

కౌగిలింతలో.. ప్రేమపుంత!

కౌగిలింత కేవలం లైంగిక ప్రేరణకు సంబం ధించింది అనుకోవడం పొరపాటు కౌగిలింత ప్రేమకు సంబంధించింది. కౌగిలింతతో లవ్ డ్రగ్' రిలీజ్ అవుతుంది. ఇది యూనివర్సల్ మెడిసిన్ అది ఏ బాధనయినా నయం చేస్తుంది. ఈ మెడిసిన్ తో చాలా లాభాలున్నాయి. ఒంటరితనాన్ని పోగొడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. టెన్షన్​ ఒత్తిడిని తగ్గిస్తుంది. కౌగిలింత ఒక ప్రేమ భాష. రెండు హృదయాలు మాట్లాడుకునే భాష! 

ఒక్క కౌగిలింత వెయ్యి మాటలతో సమానం. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలని అది చెప్తుంది. కౌగిలింత ఒక ధ్యానం వంటిది. అది భయాన్ని తగ్గిస్తుంది. మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. అనవసరమైన ఆలోచనలకు కళ్లెం కూడా వేస్తుంది. ఈ కౌగిలింత కేవలం ప్రేమి కులకే కాదు. తల్లీ బిడ్డల మధ్య ..భార్యాభర్త మధ్య.. స్నేహితుల మధ్య ఇలా ప్రతి బంధానికి కౌగిలింత ఒక వంతెన లాంటిది .హగ్ చేసుకున్నప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ అవుతాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో కౌగి లింతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ రోజు కౌగిలింత ద్వారా ప్రేమ గాఢతను వాలెంటైన్ తెలియజేస్తారు.


మీరు చేరే చోటు...

ప్రపంచం.నిన్ను వెలేసినప్పుడు, అందరూ కలిసి నిన్ను ఓడించినపుడు నీకు ఎక్కడికి పోవాలనిపిస్తుంది? నీకు ఓదార్పు లభించే చోటుకి ఓటమిని ఎదిరించే చోటుకి వెళ్లాలనుకుంటారు. కచ్చితంగా అది నిన్ను ప్రేమించే కౌగిలే మేడలు, అంతస్తులు ఎన్ని ఉన్నా. అక్కడికి చేరుకుంటారు. నిన్ను సంరక్షిస్తున్నట్టు వారి చేతులు మిమ్మల్ని చుట్టి వేస్తాయి. అపుడు ముక్కలైన హృదయం కూడా ఆ కౌగిలింతలో పూర్తిగా అతుక్కుంటుంది.. కౌగిలింతలో కురిసిన ప్రతి కన్నీటి చుక్క సంతోషాన్ని సాగు చేస్తుంది! మీరు మళ్ళీ పుడతారు. ఆ కౌగిలే మీలో కొత్త శక్తి నింపుతుంది. ఆ కౌగిలే మిమ్మల్ని యుద్ధానికి సిద్ధం చేసి.. విజయం వైపు నడిపిస్తుంది.