‘కల్కి 2898 AD’లో కర్ణుడి పాత్రపై వస్తున్న విమర్శలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అఖిల్ నటించిన ‘లెనిన్’లో ప్రమోద్ పంజు నటనను ప్రశంసిస్తూ, ‘కర్ణుడిని ఇలా చూపించాలి’ అని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు స్పందించిన నాగ్ అశ్విన్.. వివేక్ దేబ్‌రాయ్ అనువదించిన మహాభారతంలోని ద్రోణ వధ పర్వం పేజీని షేర్ చేశారు. తనను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై తనదైన స్టైల్లో రిప్లై ఇస్తూ.. ముందు మీరు మహాభారతం చదవండంటూ ఓ నెటిజన్కు క్లాస్ పీకాడు.
"మహాభారతం చదవండి. శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో తెలుసుకోండి. మన పురాణా ఇతిహాసాలపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. 'కల్కి పార్ట్ 2' కోసం వెయిట్ చేయండి" అని ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహాభారతంలోని ద్రోణ వధ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటల సారాంశాన్ని వివరిస్తూ.. ‘‘ఘటోత్కచా, ఆ శక్తి ఆయుధం ఇప్పటికే ఉపయోగించబడింది. ఓ ధనంజయా! అందువల్ల కర్ణుడు అప్పుడే సంహరించబడినట్టే భావించు. ఆ శక్తి ఆయుధం ఇంకా కర్ణుడి చేతిలో ఉండి ఉంటే, ఈ లోకంలో ఏ మనిషీ అతనికి ఎదురు నిలబడలేడు. యుద్ధరంగంలో అతడు స్వయంగా కుమారస్వామి (కార్తికేయుడు)లా అజేయుడిగా నిలిచేవాడు.
these are Sree Krishnas own words to arjuna in the drona vadha parva... pls read the Mahabharata...I suggest the bibek debroy version... Or google how many times krishna praised karna to arjuna. I have the greatest respect for our history. I know what I'm doing. Wait for part 2. pic.twitter.com/iU2CSq1uNM
— Nag Ashwin (@nagashwin7) July 12, 2026
అతని కవచం తొలగిపోవడం మన అదృష్టం. అతని కుండలాలు పోవడం మన అదృష్టం. ఆ అజేయమైన శక్తి ఆయుధం ఘటోత్కచుడిపై ప్రయోగించబడటం కూడా మన అదృష్టమే. కవచం, కుండలాలు అతని వద్ద ఉండి ఉంటే, మహాబలశాలి అయిన కర్ణుడు మూడు లోకాలలోని సమస్త జీవులతో పాటు దేవతలను కూడా జయించగలిగేవాడు.
ఇంద్రుడు, కుబేరుడు, జలాధిపతి వరుణుడు, యమధర్మరాజు సైతం కర్ణుడిని ఎదుర్కొనే ధైర్యం చేసేవారు కాదు. ఆ నరశ్రేష్ఠుడు కవచకుండలాలతో ఉండి ఉంటే, నీ గాండీవంతోనూ, నా సుదర్శన చక్రంతోనూ కూడా అతన్ని యుద్ధంలో జయించడం సాధ్యమయ్యేది కాదు. అందుకే నీ క్షేమం కోసమే శక్రుడు (ఇంద్రుడు)...’’అనే సారాంశాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు.
