మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్ రిలీజ్

మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, బాబీ డైరెక్షన్ లో నటిస్తోన్న  మెగా154 మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు.  దీపావళి కానుకగా ఫ్యాన్స్  కోసం  ఈ సినిమా టైటిల్ ను వాల్తేరు వీరయ్య గా అనౌన్స్ చేశారు.  టైటిల్ పోస్టర్ తో పాటు, టైటిల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ టీజర్ లో చిరంజీవి మరోసారి పక్కా మాస్ లుక్ లో  కనిపిస్తున్నారు. పూల చొక్కా, లుంగీ,  చెవికి రింగ్, దమ్ము కొడుతూ మాస్ గా కనిపించాడు.

‘ ఏంట్రా పూనకాలన్నారు.. అడుగేస్తే అరాచకం అన్నారు, ఏడ్రా  మీ అన్నయ్య సౌండే లేద అని విలన్ అంటుంటే.. వెంటనే  ఓ పెద్దగా మంటలు వస్తాయి.  ఈలోగా స్టైల్ గా లుంగీ కట్టుకుని.. కళ్లజోడు పెట్టుకుని బీడి తాగుతూ స్టైలీష్ గా చిరంజీవి  కనిపిస్తారు. ఇంకా ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ ధమాకాలు  కావాలంటే లైక్, షేర్, సబ్ స్క్రైబ్ చేయండంటూ చివరలో చిరంజీవి డైలాగ్  ఆకట్టుకుంటుంది.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటిస్తున్నాడు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  సంక్రాంతికి రీలీజ్ కానుంది. దేవీశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.