Waltair Veerayya Collections: 100 కోట్ల క్లబ్‌లో వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Collections: 100 కోట్ల క్లబ్‌లో వాల్తేరు వీరయ్య

సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్‌ దగ్గర రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. తొలి షోతోనే పాజిటివ్‌ టాక్ రావడంతో జనాలు సినిమాహాళ్ల బాట పట్టారు. దాంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సంక్రాంతి సెలవులు కావడం, ఇందులో రవితేజ కూడా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచాలు నెలకొన్నాయి. దీంతో మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్‌ చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పోస్టర్‌‌, వీడియోను రిలీజ్‌ చేసింది. 

ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి వింటేజ్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. చిరు డ్యాన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌కు తోడు.. కామోడీ జత కావడంతో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్‭గా దూసుకెళ్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు.