ఆగస్టు 19న​ వాంటెడ్ పండుగాడ్ రిలీజ్

ఆగస్టు 19న​ వాంటెడ్ పండుగాడ్ రిలీజ్

దర్శకుడు  కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. సుడిగాలి సుధీర్,  సునీల్, అనసూయ, ఆమని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీధర్ సీపాన దర్శకుడు. సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కి ‘పెళ్లి సందD’ హీరోహీరోయిన్ రోషన్, శ్రీలీల, దర్శకుడు హరీష్ శంకర్, రైటర్ బీవీఎస్ రవి హాజరై మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘ సినిమాల‌‌‌‌‌‌‌‌కు పూర్వ వైభ‌‌‌‌‌‌‌‌వం వ‌‌‌‌‌‌‌‌చ్చింది. సీతారామం, బింబిసార‌‌‌‌‌‌‌‌, కార్తికేయ 2 సినిమాలు సూప‌‌‌‌‌‌‌‌ర్ హిట్ అయ్యాయి.  ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్ మూవీగా రాబోతున్న ‘వాంటెడ్ పండుగాడ్’ అందర్నీ అలరిస్తుంది’ అన్నారు.

‘కమెడియన్స్ అందరం ఇందులో నటించాం. నేను కీలకపాత్రలో కనిపిస్తాను. మా టీమ్ అందరికీ ఈ సినిమా ద్వారా సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’ అన్నాడు సునీల్. ఇదొక ప్యాక్డ్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మూవీ అని చెప్పింది అనసూయ. రాఘవేంద్రరావు గారి సినిమాలో నటించడం అదృష్టం అన్నాడు సుధీర్. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ ‘రాఘవేంద్రరావు గారి రుణం తీర్చుకోలేనిది. ఆయన సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో రూపొందించిన ఈ మూవీతో  హిట్ కొట్టబోతున్నాం అనే నమ్మకం ఉంది’ అన్నాడు. తనికెళ్ల భరణి, శ్రీనివాస రెడ్డి, పృథ్వీ, దుబాయ్ శర్మ, వసంతి, దీపికా పిల్లి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.