
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్. ఆగస్టు 14న పాన్ ఇండియావైడ్‌గా సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అయాన్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘వరల్డ్‌వైడ్‌గా ఎందరో ఇష్టపడిన ‘వార్’ సినిమాకు ఫ్రాంచైజీని రూపొందించటం బాధ్యతగా భావిస్తున్నా. ఇది నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే అనుకున్నా. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అందర్నీ ఇంప్రెస్ చేసేలా ఉంటాయి.
ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా ఈ సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఎక్సయిటింగ్‌గా ఉంటారో వారి అంచనాలేంటో నాకు తెలుసు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది