వార్‌‌‌‌‌‌ 2 మూవీ షూటింగ్‌‌ ఫిబ్రవరి 23 నుంచి ఫ్రారంభం

వార్‌‌‌‌‌‌ 2 మూవీ షూటింగ్‌‌ ఫిబ్రవరి 23 నుంచి ఫ్రారంభం

జనవరిలో ‘ఫైటర్‌‌‌‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హృతిక్ రోషన్... వెంటనే తన కొత్త సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్‌‌ రోల్స్‌‌లో ‘వార్‌‌‌‌ 2’ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయాన్‌‌ ముఖర్జీ రూపొందిస్తున్న  ఈ యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

హృతిక్ కూడా ఈ మూవీ కోసం గత కొద్దిరోజులుగా జిమ్‌‌లో కష్టపడుతున్నాడు. అదే సమయంలో కాలికి గాయమైంది. నడుముకు బెల్ట్‌‌, క్రచస్‌‌ సపోర్ట్‌‌తో నిలుచున్న ఫొటోను అతను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇప్పుడప్పుడే ‘వార్‌‌‌‌ 2’ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు లేవని అభిమానులు నిరాశపడ్డారు. అయితే శుక్రవారం ఈ మూవీ షూటింగ్‌‌ గురించి మేకర్స్‌‌ అప్‌‌డేట్ ఇచ్చారు.

ఈనెల 23 నుంచి హృతిక్‌‌.. షూటింగ్‌‌లో జాయిన్ అవబోతున్నట్టు ప్రకటించారు. ఈ షెడ్యూల్‌‌లో తన ఇంట్రడక్షన్‌‌కు సంబంధించిన యాక్షన్‌‌ సీన్స్‌‌ తీయబోతున్నారట. రెండు వారాల పాటు ఈ షూట్ జరగనుందని సమాచారం. యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌ నిర్మిస్తున్న ఈ స్పై యూనివర్స్‌‌లో ఏజెంట్ కబీర్ పాత్రలో హృతిక్ నటించనున్నాడు. 2019లో వచ్చిన ‘వార్‌‌‌‌’ చిత్రానికి ఇది సీక్వెల్. వచ్చే ఏడాది ఆగష్టు 14న రిలీజ్ కానుంది.