స్పెయిన్లో వార్2 షూటింగ్.. లీకైన వీడియో.. ఎన్టీఆర్ జాయిన్ అయ్యారా?

స్పెయిన్లో వార్2 షూటింగ్.. లీకైన వీడియో.. ఎన్టీఆర్ జాయిన్ అయ్యారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్(Hrithik roshan) కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మల్టీస్టారర్ మూవీ వార్2(War2). 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను అయాన్ ముఖర్జీ(Ayan mukhraji) తెరకెక్కిస్తున్నారు.  యాష్ రాజ్ ఫిలిమ్స్(Yash raj films) నుండి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో.. వార్2 నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.

తాజాగా ఈ సినిమా నుండి ఒక వీడియో లీకైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. అక్కడ ఈ సినిమాకు సంబందించిన భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారని సమాచారం. ఈ షూటింగ్ కు సంబందించిన వీడియో ఒక నెటిజన్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో అటు హ్రితిక్ కానీ, ఇటు ఎన్టీఆర్ గానీ ఎవరు కనిపించలేదు. కేవలం ఒక కార్ చేజింగ్ సీక్వెన్స్ ను తెరకెక్కస్తున్నారు. ఇక ఈ సినిమా 2025 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరి ఎన్టీఆర్ చేస్తున్న మొదటి బాలీవుడ్ మూవీ వార్2 ఏ రేంజ్ లో ఉండనుందో తెలియాలంటే.. సంవత్సరం పాటు ఆగాల్సిందే.