అభిమానం వెర్రితలలు వేస్తే ఆ హీరోలకు, నాయకులకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో టీవీకే విజయ్ రోడ్ షో సాక్షిగా రుజువు చేసిన ఘటన ఇది. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో విజయ్ చాలా చురుకుగా వరుస రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల దగ్గరకు వెళుతున్నారు. విజయ్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందేగా.
அத்தாத்தண்டி தர்பூசணியை வண்டிக்குள்ள தூக்கி போட்டுட்டாய்ங்க.. 🤣🤣#TVKVijay pic.twitter.com/85rwXZX40r
— Sonia Vimal (@NameisSoni) April 4, 2026
తమిళ్లో స్టార్ హీరో అయిన విజయ్కు లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఈ అభిమానం విజయ్ రోడ్ షో సాక్షిగా వెర్రితలలు వేసింది. తమ అభిమాన హీరో ఎండన పడి రోడ్డు మీద తిరుగుతుంటే పుచ్చ కాయ ముక్క తినమని ఇవ్వడం తప్పు కాదు. కానీ ఏకంగా అతనిపైకి పుచ్చకాయ విసిరేస్తే అది పొరపాటున ఆ హీరోకు తగిలితే ఏం జరుగుతుందో తెలుసుగా. విజయ్ రోడ్ షోలో దాదాపుగా ఇదే జరిగింది.
విజయ్ రోడ్ షోలో అభివాదం చేస్తూ నిల్చున్న వెహికల్ మీదకు ఒక అభిమాని పుచ్చకాయ విసిరేశాడు. అది అదృష్టవశాత్తూ విజయ్కు తగలలేదు. వెహికల్లో పడింది. కానీ.. ఇదెక్కడి అభిమానం అని ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తమిళనాడుకు సైనికుడిగా, ప్రజలకు రక్షకుడిగా ఉండి కాపాడతానని టీవీకే చీఫ్ విజయ్ రోడ్ షోలో చెప్పారు. తన రాజకీయ ప్రవేశం రాష్ట్రంలోని రాజకీయాలను కుదిపేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు మొత్తం తన ఫ్యామిలీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే సామాజిక న్యాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
