మాకు ప్రజా సమస్యలే ముఖ్యం.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటం : మంత్రి సీతక్క

మాకు ప్రజా సమస్యలే ముఖ్యం.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటం :   మంత్రి సీతక్క

ఆసిఫాబాద్: ఆర్డర్స్ ఇస్తే పాస్ చేసే అధికారులుగా ఉండవద్దని, క్రియేటివిటీతో ఆలోచన చేసి ప్రజలకు మంచి జరిగేలా చూడాలని  మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ  ఆసిఫాబాద్  మండలం అప్పపెల్లి గ్రామంలో1.80 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలో రూ. 25 లక్షలతో నిర్మించనున్న ప్రెస్ క్లబ్ భవనానికి భూమి పూజ చేశారు. 

ఈసందర్భంగా మంత్రి  మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. అధికారుల వినూత్నంగా ఆలోచన చేసి ప్రజలకు మేలు చేయాలని కోరారు. కొందరు కులాలు, మతాలతో రాజకీయం చేస్తూ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. 

పేద బడుగు బలహీనర్గాలకు మేలు చేయడమే  తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్, సింగరేణి ఫండ్స్ తో అభివృద్ది చేయాలని సూచించారు. సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు.   జర్నలిస్ట్ లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు.