కన్నడ రాకింగ్ స్టార్ యశ్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'టాక్సిన్' మూవీ చుట్టూ వివాదం నెలకొంది. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో విపరీతమైన వయొలెన్స్, బోల్డ్ కంటెంట్ నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇందులో యశ్ నగ్నంగా కన్పించడం, కియారా అద్వాణీతో ఉన్న రొమాంటిక్ సీన్స్ సినీ ప్రియులను ఆశ్యర్యానికి గురిచేస్తున్నాయి. ఈ చిత్రం కేవలం పెద్దలకు మాత్రమే అని మేకర్స్ ప్రకటించినప్పటికీ.. ట్రైలర్ పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తాం..
లేటెస్ట్ గా యశ్ ను ఉద్దేశించిన కన్నడ నటి, దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు కుమార్తె రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మహిళలకు అందం ఎంత ముఖ్యమో.. పురుషులకు మర్యాద అంతే ముఖ్యం.. ఇంట్లో పెళ్లాం .. చిన్న పిల్లలు ఉన్నారనే ధ్యాస కూడా లేకుండా.. ఇలా ప్యాంట్ విప్పేసి హీరోయిన్లతో ఇదేం పద్ధతి అంటూ ఫైర్ అయ్యారు. మహిళలకు గౌరవం ఇవ్వకపోతే నిన్ను కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తాం.. 'ఐ యామ్ టాక్సిక్ ' అంటూ యశ్ ను ఉద్దేశించి తీవ్రంగా రెచ్చిపోయారు. ప్రస్తుతం నెట్టింట రిషికా వీడియో వైరల్ అవుతోంది.
ಇವರನ್ನ ಎಲ್ಲೋ ನೋಡಿದೀನಿ...
— ಅಲ್ಪಸಂಖ್ಯಾತ (@alpasankhyata) August 10, 2026
ಎಲ್ಲಿ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲಾ... 🤔 pic.twitter.com/8D33JgkSIU
తిరగబడ్డ యశ్ ఫ్యాన్స్..
మరోవైపు రిషికా సింగ్ వ్యాఖ్యల పై యశ్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మూవీలోని నటీనటులకే లేని అభ్యంతరం నీకెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా .. గతంలో రిషికా నటించిన చిత్రాల్లోని గ్లామరస్ సీన్స్, బికీనీ ఫోటో షూట్ క్లిప్స్ ను బయటకు తీసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఇదేనా నీ సంస్కారం అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ టాక్సిక్ మూవీలో యశ్ తో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుష్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో కలిసి కథ రాయడంలో భాగమయ్యారు. ఇన్ని వివాదల మధ్య టాక్సిక్ మూవీ భారీ అంచనాలతో ఆగస్టు 26న రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..
