వారఫలాలు(మే24–30): ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..ఎవరికి అనుకూలం..ప్రతి కూలం..12రాశుల ఫలితాలు ఇవే

వారఫలాలు(మే24–30): ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..ఎవరికి అనుకూలం..ప్రతి కూలం..12రాశుల ఫలితాలు ఇవే

 



వారఫలాలు ( 2026 మే 24– 30 )  :  ఈ వారం  గ్రహాల సంచారం ఎలా ఉంది.. ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది.  ఎవరికి అనూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ప్రతి కూలంగా ఉంటుంది.  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం..!

మేషరాశి:  ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. . మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. . వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. అనుకున్న స్థాయిలో లాభాలు రాక ఒత్తిడికి గురవుతారు.  అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఉద్యోగస్తులకు ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో  ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాగ్వివాదాలకు దిగవద్దు. జీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసి వస్తాయి. 

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం అదృష్టం వరిస్తుంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా ముందంజ వేసే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకి మంచి విలువ పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో పెద్దల సలహాలు మీకు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు చిక్కులను తీసుకొచ్చే అవకాశం ఉంది. పనిపై శ్రద్ధ పెడితే అధికారుల మద్దతు లభిస్తుంది. వారం ప్రశాంతంగా గడుస్తుంది. 

మిథున రాశి: ఈ వారంలో ఈ రాశి వారు చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఆదాయపరంగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి.  వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగటంతో ఈ వారం మీరు మంచి ఆర్థిక లాభాలను సంపాదిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. పై అధికారులు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. సహోద్యోగులు, అధికారుల మద్దతు వల్ల వారం చాలా అనుకూలంగా గడుస్తుంది. ఈ వారం ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అదుపుతప్పే అవకాశం ఉంది.. కొత్త పెట్టుబడులకు, కొత్త ఒప్పందాలకు ఈ వారం దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది.  వాహనాల డ్రైవింగ్‌లో  జాగ్రత్తగా  ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.  వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా గడుస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది,  పెండింగ్లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. మీ పనికి అధికారుల మెప్పు లభిస్తుంది. ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలను వింటారు. ఈవారం మొత్తం అన్ని వర్గాల వారికి అనుకూలంగానే ఉన్నప్పటికీ పని ఒత్తిడి మాత్రం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

సింహ రాశి: ఈ రాశి వారు ఈ వారంలో ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి,  కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరుల చెప్పిన మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాల విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.  
 ఉద్యోగులకు మాత్రం ఈ వారం అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.టెక్నికల్ రంగాల్లో పనిచేసే వారికి పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. హామీ సంతకాలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు

కన్య రాశి: ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగాఉంటుంది.  విదేశీ యాత్రలు చేసే అవకాశం ఉంది.   వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది.  వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా సాగుతాయి.  నిరుద్యోగులు శుభవార్త వింటారు.  ఉద్యోగస్తులకు గ్రహాల అనుకూలత వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.  స్త్రీల విషయాల్లో మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి. ఇరుగుపొరుగు వారితో కానీ, బంధుమిత్రులతో కానీ అనవసరమైన వాగ్వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

తులా రాశి:ఈ రాశి వారు ఈ వారంలో ఎక్కువుగా శుభవార్తలు వినే అవకాశం ఉంది.  దగ్గరి బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి.  ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వృత్తి.. వ్యాపారాలు లాభాల దిశగా ఉంటాయి.  అనుకోకుండా ధనలాభం కలుగుతాయి.  ఉద్యోగస్తులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. వేతనం పెరిగేందుకు అవకాశం ఉంది.  నిరుద్యోగులు కొత్త ఆఫర్లు అందుకుంటారు.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు చదువుల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా గడుస్తుంది.  చేపట్టిన పనుల్లో చాలావరకు అనుకూలఫలితాలుంటాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. బిజినెస్​ డెవలస్​ మెంట్​ కు కొత్త అవకాశాలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో కొన్ని విషయాలు చక్కపడతాయి.  సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి.  వృత్తి వ్యాపారాలకు సంబంధించి పురోగతి ఉంటుంది.  కొత్తగా వాహనం కొనేందుకు అవకాశాలున్నాయి. నిరుద్యోగులు గుడ్​న్యూస్​ వింటారు.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ప్రేమ వ్యవహారాలను వాయిదావేయడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 


ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం శ్రమ అధికంగా ఉన్నప్పటికి ... చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేస్తారు.  కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం చాలా మంచిది.  వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు  ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే పరిస్థితి కనిపిస్తుంది. ఏ పని తలపెట్టినా సరైన ప్రణాళికతో ముందుకు సాగండి. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసి వస్తాయి.  ఆవేశానికి.. కోపానికి చాలా దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. 

మకర రాశి: ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక పరిస్ఠితి మెరుగుపడే అవకాశం ఉంది.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.  భావోద్వేగాలకు దూరంగా ఉండండి. వ్యాపార పరంగా ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సాధ్యమైనంత మౌనంగా ఉండండి. ఉద్యోగస్తుల విషయంలో పెద్దగా మార్పులు   ఏమీ లేనప్పటికీ పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. 

కుంభ రాశి: ఈ రాశి వారు ఈ వారం  భారీ పెట్టుబడులకు దూరంగా ఉండండి. వ్యాపారపరమైన ముఖ్యమైన నిర్ణయాల విషయంలోజీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోయినా నష్టం ఉండదు.  ఉద్యోగస్తులకు పనిపై శ్రద్ధ చాలా అవసరం.  అనవసరంగామాట పడే అవకాశాలున్నాయి.  ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం చాలా అవసరం.  అకస్మాత్తుగా వ్యాపారపరంగా గాని, ఉద్యోగపరంగా గాని దూర ప్రయాణాలు చేసే అవసరం పడవచ్చు.  ఆరోగ్య విషయంలో  చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

మీన రాశి:ఈ వారం  ఈరాశి వారికి  ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. స్థిరాస్థికి సంబంధించి కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దుబారా ఖర్చులు పెరుగుతాయి.  అనుకున్న  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్తగా ఆదాయ మార్గాలకు  శ్రీకారం చుడతారు. జాబ్​ మారేందుకు ఇది అనుకూలమైన సమయంం.  వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం