వారఫలాలు ( 2026 మే 31– జూన్ 6 ): ఈ వారం గ్రహాల సంచారంభారీగా మారే అవకాశం ఉంది. గ్రహాల మార్పుతో ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది. ఎవరికి అనూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ప్రతి కూలంగా ఉంటుంది. 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం..!
మేషరాశి: ఈ వారం ఈ రాశి వారు ప్రతి పనిలో మరింత శ్రమించాలి. ఖర్చులు అధికమవుతాయి. బుధవారం నాడు చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రతి విషయాన్ని ఆలోచించి సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగులు శ్రమించవలసి ఉంటుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. . ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని పండితులు చెబుతున్నారు
మిథునరాశి: ఈ వారం ఈ రాశి వారికి సంతృప్తికరంగా గడిచిపోతుంది. వ్యక్తిగత విషయాలు పరిష్కరిస్తారు. వృత్తి.. వ్యాపారుల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల సమస్యలు కొలిక్కి వస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుందని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి.
కర్కాటక రాశి: ఈ వారం ఈ రాశి వారు అనుకున్న పనులు కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి. ఉత్సాహంగా అడుగు ముందుచేస్తారు. ఆవేశాన్ని .. కోపాన్ని.. ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి. ఇతరుల విమర్శలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవద్దు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.అవగాహన లేని విషయాలను అస్సలు చర్చించవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారం మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులకు ఈ వారం చాలా అనుకూలమైనదని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభించే అవకాశం ఉంది.
కన్యారాశి: ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరే అవకాశం ఉంది. ఈ వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందేందుకు రూట్ క్లియర్ అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనుల్లో ఈ వారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తులారాశి: ఈ వారం ఈ రాశి వారికి ఈ వారం గ్రహబలం అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. పెద్దమొత్తాల్లో లాభాలను అందిస్తాయి. జాయింట్ వ్యాపారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. హోదాతో కూడిన భాద్యతలు వరిస్తాయి. నిరుద్యోగులు మంచి ఆఫర్ లు అందుకుంటారు. విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఈ వారం సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటివారితో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు లాభాలు తెచ్చే అవకాశముంది. ఉద్యోగాలలో మీ కృషి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆదాయం మెరుగుపడుతుంది. కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉన్నా పెద్దల సహకారంతో సమస్యలు తగ్గుతాయి. ప్రేమ జీవితంలో నిజాయతీ అవసరం. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనస్సురాశి: ఈ రాశి వారికి ఈ వారం ఈ వారం ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. దీర్ఘాకాలిక రుణబాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు . ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహా కలిగించే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో స్థిరాస్థి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు వారం మధ్యలో గుడ్ న్యూస్ వింటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మకరరాశి: ఈ రాశి వారు ఈ వారం రిస్క్ తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో ఆలస్యం అయినా.. వారం మధ్యలో పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలున్నాయి. వారం చివరిలో కెరీర్ గురించి మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. వృత్తి .. ఉద్యోగాల్లో కీలక పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి అవార్డులు అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు కలుగుతాయి, బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. గతంలో ఉన్న ఆర్ధిక సమస్యలు పరిష్కారమవుతాయి. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారం అంతా మంచే జరుగుతుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వారం చివరిలో ఆర్థికంగా పురోభివృద్దితో పాటు సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్ఠలు లభిస్తాయి. వృత్తి.. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలు గడించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
