వారఫలాలు(జులై26–ఆగస్టు1): ఉద్యోగం.. వ్యాపారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.. ఈ వారం ఎవరికి అదృష్టం కలిసొస్తుంది..!

వారఫలాలు(జులై26–ఆగస్టు1): ఉద్యోగం.. వ్యాపారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.. ఈ వారం ఎవరికి అదృష్టం కలిసొస్తుంది..!

వారఫలాలు ( జులై 26 – ఆగస్టు 1): చాతర్మాసం మొదలైంది.  విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశించారు.  తొలిఏకాదశి తరువాత రోజే ఈ వారం ప్రారంభమైంది.  2026 జులై 26 నుంచి ఆగస్టు 1 వరకు ఏ రాశి వారు ఎలా ఉంటుంది.. ఏ రంగంలో సాధిస్తారు.. ఉద్యోగ..వ్యాపారాలు ఎలాసాగుతాయి.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశుల వారి వారఫలాలను తెలుసుకుందాం. . .!  

మేషరాశి: ఈ రాశి వారికి ఈవారం   స్నేహసంబంధాలు బలపడతాయి.అనుకున్న  లక్ష్యం నెరవేరుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. కీలక విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయంతో మంచి జరుగుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు.  ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న  పని పూర్తయ్యే అవకాశం ఉంది.  పెళ్లి ప్రయత్నాలు చేసే వారు గుడ్​ న్యూస్ వింటారు.  ఉద్యోగస్తులు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతాయి. అయినా చాకచక్యంతో ఇబ్బందులను అధికమిస్తారు.  ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు ఉంటాయి. 

వృషభ రాశి :   ఈ వారం  ఈ రాశి వారికి ఈ మిశ్రమ ఫలితాలుంటాయి.  ఏదో తెలియని ఆందోళన వేధిస్తుంది.  వ్యాపారస్తులకు సామాన్యమైన లాభాలుంటాయి. కోర్టు వ్యవహారాలు కలసి వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  ఉద్యోగస్తులకు పనిభారం పెరగడం.. సహోద్యోగుల వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.  అనవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.  డబ్బును ఖర్చు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

మిధునరాశి : మిథున రాశి వారికి ఆగస్టు నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వారి పై అధికారులు, సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. పనిలో అద్భుతమైన పనితీరు కారణంగా మీకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. సొంత స్థానంలో ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలను ఆశించవచ్చు. మీ పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు లభిస్తాయి. ఇది మిమ్మల్ని సంతోషపరిచే సమయం. ఈ నెల విద్యార్థులకు మంచిది. ఇది ఆర్థిక ప్రశాంతతను తెచ్చిపెట్టే సమయం. గతంలో చేసిన కష్టానికి ఫలాలు ఆగస్టు నెలలో రెట్టింపు అవుతాయి. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.

కర్కాటక రాశి:  ఈ రాశి వారికి ఈ వారంలో కెరీర్ లో ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉంది.  
ఆకర్షణ శక్తి, ఆత్మవిశ్వాసం తారాస్థాయికి చేరుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లేదా కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఎప్పడూ వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ధన లాభం కలుగుతుంది. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయమని పండితులు చెబుతున్నారు. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు. 

సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో దీర్ఘకాలంగా పెండింగ్ పనులు ఊపందుకుంటాయి.  ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.  ఆత్మవిశ్వాసం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభించవచ్చు. ప్రమోషన్​ కోసం  ఎదురు చూసే వారికి పరిస్థితులు  అనుకూలంగా మారవచ్చు. ఆఫీసులో ప్రత్యేక గుర్తింపు పొందుతారు.  వ్యాపారవేత్తలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది.  మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు.  కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  ఇంటా .. బటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  పెళ్లి సంబంధాలు చూసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.  పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు అండదండలు పుష్కలంగా ఉంటాయి.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వారం సంతోషంగా గడుస్తుందని పండితులు చెబుతున్నారు. 

తులా రాశి:  ఈ రాశి వారు ఈ వారం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కెరీర్‌లో మీరు కోరుకున్న మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్సఫర్​ అయ్యే అవకాశాలున్నాయి.  కుటుంబంతో కలిసి యాత్రలు చేసే అవకాశాలున్నాయి.  మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్​ టర్నింగ్ పాయింట్​ అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికపరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.  కోర్టు వ్యవహారాలు మీ అనుకూలంగా మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభించే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.  పాత పెట్టుబడుల నుంచి అధికంగా లాభాలు వస్తాయి.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా సవ్యంగా సాగిపోతుందని పండితులు చెబుతున్నారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఉదర (పొట్ట) సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.  వృత్తి.. వ్యాపారాల్లో సామాన్య లాభాలుంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.  ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిద వేసుకోండి. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది. 

మకరరాశి: ఈ రాశి వారు ఈవారం  కఠోర శ్రమ వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.  కార్యాలయంలో మీ పనితీరు, బాధ్యతలను నిర్వహించే సామర్థ్యం ఉన్నతాధికారులను ఆకట్టుకుంటాయి.  ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో కూడా సానుకూల ఫలితాలు సాధించవచ్చు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అవకాశాలను పొందుతారు. ప్రధాన కంపెనీలు లేదా ప్రభావవంతమైన క్లయింట్‌లతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

కుంభ రాశి:  ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నాయి.  కొంతమందికి విదేశీ ప్రయాణాలు కలిసివచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు అవార్డులు అందుకుంటారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఆర్జిస్తారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఆందోళనల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం  ఉంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  పెళ్లి కోసం ఎదురు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. 

మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారం  అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులకు వారం ప్రారంభంలో ఆందోళన కలిగిస్తుంది.  అయినా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.  గతంలో మిమ్మలను విబేధించిన వారు  మీ దగ్గరకు రావలసిన పరిస్థితులు ఏర్పడుతాయి.  అయితే మీ జీవిత భాగస్వామి  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఇక ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.