వారఫలాలు(జూన్ 7–13): ఈ వారం ఏరాశి వారికి ఎలా ఉంటుంది.. ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. 12 రాశుల వారి పూర్తి వివరాలు ఇవే..!

వారఫలాలు(జూన్ 7–13):   ఈ వారం  ఏరాశి  వారికి ఎలా ఉంటుంది.. ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. 12  రాశుల వారి పూర్తి వివరాలు ఇవే..!

 వారఫలాలు ( 2026 జూన్​6-13 )  :  ఈ వారం  గ్రహాల సంచారం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహాల మార్పుతో ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది.  ఎవరికి అనూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. 12 రాశుల వారి వారఫలాలను  తెలుసుకుందాం..!

మేష రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో  చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. అప్పులబాధ నుంచి బయట పడతారు.  నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి.చేతి వృత్తుల వారు.. వ్యాపారస్తులు ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు.  ఉద్యోగస్తులకు  సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో మాటపట్టింపుల విషయంల జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

 వృషభ రాశి : ఈ రాశి వారు  కొన్ని విషయాల్లో ఓర్పు.. సహనం పాటించాలి.   ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికలను రూపొందించుకుని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు.  ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు

 మిథున రాశి :ఈ రాశి వారికి ఈ వారం అన్ని  విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరగడంతో పాటు  ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.   వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులను చాలావరకు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  


 కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈ వారంలో  చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు, వృథా ఖర్చులు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. 

 సింహ రాశి :  ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.  భూ సంబంధిత క్రయవిక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారస్తులకు  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

 కన్య రాశి : ఈ  రాశి వారికి  ఈ వారమంతా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని జ్యోతిష్య పండితుతు చెబుతున్నారు.. . ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఊపు అందుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనన్నాయి. . నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ, పుణ్య కార్యాల్లోనూ పాల్గొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

తుల రాశి : ఈ  రాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు.  మీరు తీసుకున్న ఆలోచనలు అమలు చేస్తారు. మీ నిర్ణయాలపై కుటుంబంలో అనుకూలత. సకాలంలో రావలసిన డబ్బు సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. అనుకున్న రాబడి. ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి పొందుతారు.  వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి :ఈ రాశి వారికి ఈవారంలో  ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.  ఇవి ముందు మీకు అసంతృప్తి కలిగించినా.. తరువాత మంచే జరుగుతుంది.  ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు వారం చివరిలో పరిష్కారం అవుతాయి.  ఉద్యోగస్తులకు కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.  ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినప్పటికి.. సంతృప్తికరంగానే ఉంటుంది.  డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.  నిరుద్యోగులు కష్టపడాల్సి ఉంటుంది.  ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి. 

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈ వారంలో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  అయినా మీ తెలివి తేటలతో అధిగమిస్తారు. కొన్ని అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది.  కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్​ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్​ ఉద్యోగస్తులకు వారం చివరిలో ప్రమోషన్​ వచ్చే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారస్తులు  లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు జాబ్​ లభించే అవకాశం ఉంది.  పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

మకర రాశి : ఈ రాశి ఈ వారం బిజీబీజీగా గడుపుతారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి ఉంటుంది.  వృత్తి... వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి  వస్తాయి. 

 కుంభ రాశి : ఈ వారం  ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఈ వారం మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పోతుంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతల్లో  కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.

మీన రాశి :ఈ రాశి వారికి ఈ వారం చివరిలో గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  మీరు అనుకున్న ప్రాజెక్ట్​ మొదలు పెట్టి విజయం సాధిస్తారు.  ప్రతి విషయంలోనూ సీక్రసీ మెయింటైన్​ చేయండి.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి.  వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు కలుగుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ప్రేమ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి.ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం