వారఫలాలు(జులై 12 – 18) : ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంది.. 12 రాశుల వారి జాతకం ఇదే..!

వారఫలాలు(జులై 12 – 18) :   ఈ వారం  ఏ రాశి వారికి ఎలా ఉంది.. 12 రాశుల వారి జాతకం ఇదే..!

వారఫలాలు ( జులై 12‌‌‌‌–18): ఈ వారం గ్రహాల సంచారం  ఆధారంగా ఏరాశి వారికి ఎలా ఉంది.. ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు.. విద్య.. ఉద్యోగం.. వ్యాపారం.. ఆర్థిక విషయాల్లో ఎవరికి ఎలా ఉంటుంది. గ్రహాల సంచారం మార్పుతో 12 రాశుల వారికి ఎవరికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.  .

మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా  కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు  చెబుతున్నారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగస్తులు ఎలాలంటి ఇబ్బంది ఉండదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్​ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిది. 

వృషభరాశి:  ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.  ఈ వారంలో ఊహించని ఆర్థిక లాభాలు అందుకుంటారు.  గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలున్నాయి. తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్యపండితులు సూచిస్తున్నారు.

మిథునరాశి:  ఈ రాశి వారికి ఈ వారంలలో ప్రతి విషయం కూడా  ప్రయోజనకరంగా ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో పాటు వేతనం పెరుగుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. కోపాన్ని.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

 కర్కాటక రాశి:  ఈ రాశి వారికి ఈ వారంలో సానుకూల మార్పులు ఉంటాయి.  పెండింగ్​లో ఉన్న పనులు పూర్తవుతాయి.  మానసికంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.  జాబ్​ మారేందుకు ఈ వారం మంచి సమయమని పండితులు చెబుతున్నారు.  పాత పెట్టుబడుల ఫలితం ఈ వారంలో ఉంటుంది.  ఉద్యోగస్తులకు  బాధ్యతలు పెరుగుతాయి.  ఆఫీసులో అవార్డులు అందుకొనే అవకాశం ఉంది.  ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

సింహరాశి: ఈ రాశివారికి ఈ వారం పనిభారం పెరిగినా సంతృప్తికరంగానే జీవనం కొనసాగిస్తారు.  ఉన్నతాధికారుల నుంచి అభినందనలు పొందుతారు.  ఏదో తెలియని ఆందోళన చెందుతారు.  వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.  అయితే ఎవరితోను వాదనలు పెట్టుకోకండి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆరోగ్య పరంగా జలుబు..దగ్గు.. కొద్దిపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. కెరీర్​ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 

కన్యారాశి : ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్త వింటారు. కొత్త వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తారు.  అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

తులారాశి:  ఈ రాశి వారు ఈ వారు చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుతుపుతారు.  గతంలో పడిన ఇబ్బందులు తొలగిపోతాయి.  అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  సమాజంలో గౌరవం లభిస్తుంది.  మీ పనితీరుకు అధికారులు సంతృప్తి చెందుతారు. కొత్త గా వాహనం లేదా భూమిని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి .. అంతా మంచే జరుగుతుంది.  ఆర్థిక పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.తున్నారు. 

వృశ్చిక రాశి:  ఈ వారం ఈ రాశి వారికి   ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి.   ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  పెండింగ్​ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. జీవితభాగస్వామి వలన ధనలాభం వచ్చే అవకాశం ఉంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి.  అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

ధనుస్సురాశి:  ఈ వారం ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.   ఆర్థికంగా చాలా బాగుంటుంది.  మీకు సొంత కంపెనీ ఉంటే అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెరీర్​ విషయంలో ఎలాంటి  మార్పులు ఉండదు.  అనుకోకుండా ఖర్చులు రావడంతో ఆర్థికంగా ఇబ్బందిపడతారు. ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

మకర రాశి:  ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉటుంది.  వ్యక్తిగత జీవితంలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది.  పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుది. వ్యక్తిగత జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది.  నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.  ఉద్యోగస్తులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పని అవుతుంది.  వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి:  ఈ వారం ఈ రాశి  వారు తమ ప్రణాళికలు అమలు చేస్తారు.  చాలా కాలంగా పెండింగ్​ బకాయిలు వసూలవుతాయి.  ఆహారం తీసుకొనే విషయంలో సమయాన్ని పాటించండి. వాహనం డ్రైవింగ్​ విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది.  కొత్త ప్రాజెక్ట్​లు చేపడుతారు. వ్యాపారస్తులు ఆర్థికంగా అభివృద్ది చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

మీనరాశి: ఈ వారం  ఈరాశి వారికి  ఒత్తిడి .. ఆందోళన  పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఖర్చులు రావడంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి.  కొత్త పెట్టుబడుల విషయంలో వాయిదా వేసుకోండి.  అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.   ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు అధికంగా కష్ట పడాల్సి ఉంటుంది.  నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేయండి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.