వారఫలాలు(జులై 19 – 25) : ఆర్థికం, ఉద్యోగం ఎవరికి కలిసి వస్తుంది.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..12 రాశుల వారి పూర్తి వివరాలు ఇవే..!

వారఫలాలు(జులై 19 – 25) :  ఆర్థికం, ఉద్యోగం  ఎవరికి కలిసి వస్తుంది.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..12 రాశుల వారి పూర్తి వివరాలు ఇవే..!

వారఫలాలు ( జులై 19‌‌‌‌–25): ఈ వారం గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం వంటి రంగాల్లో శుభఫలితాలు కనిపించే అవకాశం ఉంది.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుతో ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది.12 రాశుల వారి వారఫలాలను  తెలుసుకుందాం..! 

మేషరాశి : ఈ వారం ఈ రాశి వారు  శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.  రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది.  ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది.  వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

వృషభ రాశి :  ఈ రాశి వారికి ఈ వారం  ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ధన రాబడి.. సంపద  పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడవచ్చు.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకుఅధికంగా లాభాలు ఉంటాయి.  తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. 

మిథునరాశి:  ఈ రాశి వారు ఈ వారం శుభవార్తలు వినే అవకాశం ఉంది.  పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి  సరైన సమయమని పండితులు చెబుతున్నారు.  కెరీర్​ విషయంలో పురోగతి ఉంటుంది.  గతంలో వివిధ కారణాలతో  రావలసి.. ఆగిపోయిన డబ్బు ఈ వారంలో వస్తుంది.  కుటుంబంలో వృద్ధి జరుగుతుంది.ఉద్యోగస్తులకు ఆఫీసులో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రేమ వ్యవహారంలో శుభవార్త వింటారు.

కర్కాటకరాశి :  ఈ రాశి వారికి ఈ వారంలో జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. చాలాకాలం నుంచి ఉన్న సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ఉద్యోగస్తులు కీలకబాధ్యతలు తీసుకోవలసి ఉంటుంది.  టీమ్​ లీడర్​గా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.  కొత్త ప్రాజెక్ట్​ లు చేపట్టే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి.  కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు. 

సింహరాశి: ఈ రాశి వారు   ఈ వారం రిస్క్​ తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో ఆలస్యం అయినా.. వారం మధ్యలో  పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలున్నాయి.   వారం చివరిలో కెరీర్​ గురించి మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  వృత్తి .. ఉద్యోగాల్లో కీలక  పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

కన్యారాశి : ఈ రాశి వారికి ఈ వారంలో అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది.  మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది,  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది,  ఉద్యోగస్తులు అవార్డ్ లు పొందే అవకాశం ఉంది.  అన్నీ విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది.  వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారులు పెట్టుబడులు సమీకరించుకుంటారు.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త భాగస్వాములు చేరతారని పండితులు చెబుతున్నారు. 

తులారాశి: ఈ వారం ఈ రాశి వారు  కెరీర్ గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  వృత్తి .. ఉద్యోగాల్లో కీలక  పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేందు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.  ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.

వృశ్చికరాశి :  ఈ రాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది.  కుటుంబ సభ్యుల మద్దతుతో సంబంధాలు మెరుగుపడతాయి.  గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి డబ్బు వస్తుంది.  వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి.  చేతి వృత్తులవారికి అనుకోని లాభాలు కలుగుతాయి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆర్థిక విషయాల్లో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి.  డబ్బు అధికంగా ఖర్చయ్యే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు.

ధనస్సురాశి:  ఈ రాశి కి చెందిన ఉద్యోగస్తులు ఈ వారంలో శుభవార్తలు వింటారు.  వృత్తి..వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  గతంలో ఉన్న ఫైనాన్స్​ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.  నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.  స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.  చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తిని  కొనుగోలుచేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

మకరరాశి:  ఈ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి.  గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.  ప్రభుత్వ ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడతారు.  ప్రైవేట్​ ఉద్యోగస్తులు మీ పని తీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు,  మీకు అప్పగించిన పనిలో విజయం సాధిస్తారు.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఖర్చులను నియంత్రించుకోండి.  ఆఫీసులో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి:  ఈ రాశి వారు ఈ వారంలో ఆర్థిక స్థిరత్వం పొందే అవకాశాలున్నాయి.  విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. . మీ మాటతీరు.. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు.  పనిలో కొత్త బాధ్యతలు తీసుకోవలసి ఉంటుంది.  ఉద్యోగస్తులు  కష్టపడాల్సి ఉంటుంది.  అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. 

మీనరాశి:  ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది.  సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి.  ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి.  ఆర్థిక పురోగతి సాధిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  గతంలో ఉన్న  చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారు అంచనాలు , ఊహలు నిజం చేసుకుంటారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.