Weekend OTT Releases: థియేటర్లలో కంటే ఓటీటీలోనే రచ్చ.. ఈ వీకెండ్ చూడాల్సిన సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు!

Weekend OTT Releases: థియేటర్లలో కంటే ఓటీటీలోనే రచ్చ.. ఈ వీకెండ్ చూడాల్సిన సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు!

ఈ వారం థియేటర్లలో కంటే ఓటీటీలోనే అసలు ఎంటర్‌టైన్‌మెంట్ బజ్ కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాల నుంచి క్రైమ్ థ్రిల్లర్స్, స్పై యాక్షన్, తెలుగు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ కంటెంట్‌ వరకు బోలెడు కొత్త కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఆలియా భట్ 'ఆల్ఫా', సుమంత్ 'న్యూటన్స్ థర్డ్ లా', 'ఆకలి రాజ్యం 2026' వంటి వాటిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారాంతానికి మీ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే..

‘ఆల్ఫా’తో మొదలు...

ఆలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆల్ఫా’ ఈ వారం బిగ్గెస్ట్ OTT అట్రాక్షన్స్‌లో ఒకటి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన ఈ సినిమా ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సీక్రెట్ మిలిటరీ ప్రోగ్రామ్, స్పై మిషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో సాగిపోయే ఈ మూవీలో ఆలియా, శార్వరి స్పై ఏజెంట్లుగా కనిపిస్తారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో మిస్ అయిన వారికి ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది.

 

'న్యూటన్స్ థర్డ్ లా' ...

సుమంత్ హీరోగా రాజేశ్ కర్ణ తెరకెక్కించిన 'న్యూటన్స్ థర్డ్ లా' కూడా డిజిటల్‌లోకి వచ్చేసింది. జంట హత్యల చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్, కర్మ వంటి అంశాలను మిక్స్ చేశారు. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించడంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.

'ఆకలి రాజ్యం 2026'...

1980లో కమల్ హాసన్ నటించిన 'ఆకలి రాజ్యం' ఇప్పటికీ ప్రత్యేకమైన సినిమానే. నిరుద్యోగం, యువత కష్టాలు, ఉద్యోగం కోసం పడే తిప్పలు వంటి అంశాలను అప్పట్లోనే బలంగా చూపించిన ఆ సినిమాకు ఇప్పుడు కొత్త తరం టచ్ ఇస్తూ 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ వచ్చింది. ఆగస్టు 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సిరీస్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

'ఐ, నోబడీ'...

పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు జంటగా నటించిన 'ఐ, నోబడీ' కూడా ఈ వారం OTTలో అందుబాటులోకి వచ్చింది. నిస్సాం బషీర్ తెరకెక్కించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఊహించని మలుపులు ప్రధాన ఆకర్షణ. ఒక సాధారణ వ్యక్తి అనుకోకుండా చూడకూడనిది చూడటంతో అతని జీవితం పూర్తిగా తలకిందులవుతుంది.

 

'పార్ట్ టైమర్స్'.. 

జియో హాట్‌స్టార్‌లో ఆగస్టు 28 నుంచి 'పార్ట్ టైమర్స్' స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు భిన్నమైన యువతులు రూమ్‌మేట్స్‌గా ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూనే స్టార్టప్ ప్రారంభించేందుకు ప్రయత్నించే కథ ఇది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్‌షిప్, యూత్ లైఫ్, స్టార్టప్ కల్చర్ వంటి అంశాలతో సిరీస్ సాగుతుంది..

 

నెట్‌ఫ్లిక్స్: 
ఈ వారం ఓటీటీ వాచ్‌లిస్ట్ లో 'ఆల్ఫా', 'న్యూటన్స్ థర్డ్ లా', 'ది విస్పర్ మ్యాన్', 'చుంబక్', 'గ్రేవ్‌యార్డ్ సీజన్ 3', 'మౌస్ ట్రాప్', 'సీక్రెట్ ఉమెన్', 'ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్', 'బ్యూటీ ఇన్ బ్లాక్: సీజన్ 3'.

జియో హాట్‌స్టార్:
'పార్ట్ టైమర్స్',
'మైఖేల్
'

ఆహా: 'ఆకలి రాజ్యం 2026'.

అమెజాన్ ప్రైమ్ వీడియో: 
'బబితా సింగ్ రిపోర్టింగ్'
'బెట్టి లా ఫియా సీజన్ 3'
 'కేజేక్యూ'. 

సోనీ లివ్:
'అన్బే డయానా'
 'అంకం అత్తహాసం'

జీ5: 'బందర్'.

ఆపిల్ టీవీ+: 
'డార్క్ మేటర్ సీజన్ 2'.

లయన్స్‌గేట్ ప్లే: 'హంగ్రీ'.

మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'న్యూటన్స్ థర్డ్ లా', యాక్షన్ ప్రియులకు'ఆల్ఫా', మలయాళం థ్రిల్లర్స్ ఫ్యాన్స్‌కు 'ఐ, నోబడీ', తెలుగు కంటెంట్ కోరుకునేవారికి 'ఆకలి రాజ్యం 2026', యూత్ ఆడియన్స్‌కు 'పార్ట్ టైమర్స్' ఈ వీకెండ్ బెస్ట్ ఆప్షన్స్‌గా కనిపిస్తున్నాయి. మరి ముందుగా ఏది స్టార్ట్ చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి...