జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారంలో అనురాధ నక్షత్రంలోకి బుధుడు.. శుక్రుడు చిత్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కుజ, గురు గ్రహాలు త్రికోణాకారంలో సంచరిస్తాయి. గ్రహాల మార్పుతో ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది. 12 రాశుల వారి వారఫలాలను తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులను చాలావరకు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో కీలక మలుపులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలను వాయిదా వేయాలని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కెరీర్ విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి.వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోకపోతే నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు మిత్రుల మాటలు విని వ్యసనాలకు బానిసయ్యే అవకాకాశాలున్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. .ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వారం చివరిలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ, పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పోతుంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.
ఉద్యోగంలో బాధ్యతల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం చివరిలో గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. మీరు అనుకున్న ప్రాజెక్ట్ మొదలు పెట్టి విజయం సాధిస్తారు. ప్రతి విషయంలోనూ సీక్రసీ మెయింటైన్ చేయండి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ప్రేమ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సింహ రాశి: ఈ వారంలో ఇదే రాశిలో గురుడు ప్రవేశించడం వలన కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. . ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనన్నాయి. . నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ, పుణ్య కార్యాల్లోనూ పాల్గొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఆదాయం నిలకడగా ఉన్నా.. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు, వృథా ఖర్చులు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు.
తులా రాశి: ఈ రాశి ఈ వారం బిజీబీజీగా గడుపుతారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి.. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. గత పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. అప్పులబాధ నుంచి బయట పడతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి.చేతి వృత్తుల వారు.. వ్యాపారస్తులు ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో మాటపట్టింపుల విషయంల జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి: ఈ వారం ఈరాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. కెరీర్ నిమిత్తం విదేశాలకు వెళ్లేఅవకాశం ఉంటుంది. కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారు ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే అదనపు ఖర్చులు ఉంటాయి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో పెండింగులో ఉన్న బకాయిలన్నీ లభిస్తాయి. స్నేహితులు, ప్రియమైన వారితో యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.. మీరు చేసే ప్రతి పనిలో మంచి విజయం సాధిస్తారు.ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం పెరిగినా.. దానికంటే ఎక్కువుగా ఖర్చులు పెరుగుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శత్రువులు.. నమ్మక ద్రోహులు చెడు చేసే అవకాశం ఉన్నందున వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. పాత స్నేహితులను వదిలి కొత్తవారితో స్నేహం చేస్తారు. అనవసర పరిచయాలు ఏర్పడటంతో సమాజంలో కొన్ని అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
మీనరాశి: ఈ రాశి వారు ఈ వారంలో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. అయినా మీ తెలివి తేటలతో అధిగమిస్తారు. కొన్ని అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు వారం చివరిలో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు జాబ్ లభించే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
