వారఫలాలు...ఈ రాశుల వారికి అదృష్టం

వారఫలాలు...ఈ రాశుల వారికి అదృష్టం

మేషం

అదనపు ఆదాయం సమకూరినా ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. ఉద్యోగులకు ఊహించని మార్పులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కీలక సమాచారం. కళాకారులు, వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. 

వృషభం

ఆదాయం గతం కంటే మెరుగు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పట్టుదల, ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. కళాకారులు, క్రీడాకారులు కాస్త ఊరట చెందుతారు.

మిథునం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లేదా ధనలాభాలు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహం. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. కళాకారులు, రాజకీయవర్గాలకు విశేష ఆదరణ. క్రీడాకారులకు శ్రమ పెరిగి కొంత నిరాశ.

కర్కాటకం

రావలసిన సొమ్ము అందుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితుల నుంచి ముఖ్య సందేశం. ఆస్తి విషయాల్లో బంధువులతో ఒప్పందాలు. చిరకాల ప్రత్యర్థులు  స్నేహితులుగా మారతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో గుర్తింపు. వ్యాపారులకు ఆశించిన పెట్టుబడులు. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, కళాకారులు  బిజీగా గడుపుతారు.

సింహం

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. ధనలాభం. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలం. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారులకు లాభాలు. ఒక సమాచారం ఉద్యోగులకు ఊరటనిస్తుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతం. క్రీడాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం.

కన్య

శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది.  ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల తోడ్పాటు. భూములు, భవనాలు కొంటారు. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు. స్థిరాస్తుల వృద్ధి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు తగిన లాభాలు. రాజకీయ, పారిశ్రామికవర్గాల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.

తుల

ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బాకీలు అందుతాయి. అరుదైన ఆహ్వానాలు. వాహన యోగం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార విస్తరణ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. పెట్టుబడులు కొంత ఊరట కలిగిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా సమర్థత చాటుకుంటారు. కళాకారులు, రాజకీయవేత్తల యత్నాలు సఫలం. పరిశోధకులకు మంచి గుర్తింపు.

వృశ్చికం

కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. భూములు వాహనాలు కొంటారు. అదనపు ఆదాయం సమకూరి అప్పులు తీరతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగులకు పోస్టుల్లో మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవర్గాలకు మరింత ఆదరణ లభిస్తుంది. పరిశోధకుల కృషి ఫలిస్తుంది.

ధనస్సు

అదనపు ఆదాయం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనల అమలు. మీ వ్యూహాలు అమలుపర్చి కొన్ని విజయాలు సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో  ప్రశంసలు, కొత్త బాధ్యతలు. కళాకారులు, రాజకీయవేత్తలకు  సంతోషకర సమాచారం. 

మకరం

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం. సోదరులు, సోదరీలతో సఖ్యత.  భూలాభాలు. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు తొలగే సమయం. పరిశోధకులు, కళాకారులకు శుభవార్తలు.

కుంభం

పాతబాకీల వసూలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు అన్ని విధాలా అనుకూలమైన కాలం. పరిశోధకులు, క్రీడాకారులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి.

మీనం

భూములు, ఆభరణాలు కొంటారు. కుటుంబసభ్యుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారులకు మొదట్లో ఇబ్బందిగా ఉన్నా క్రమేపీ లాభాలు. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు ఆకస్మిక పర్యటనలు. క్రీడాకారులు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400