వారఫలాలు...ఈ రాశుల వారికి అదృష్టం

వారఫలాలు...ఈ రాశుల వారికి అదృష్టం

మేషం

చేపట్టిన కార్యాలు విజయవంతం. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. రాబడి ఆశాజనకం. శుభవర్తమానాలు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. పెద్దల సలహాలు పాటిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త పోస్టులు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

వృషభం

అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. యుక్తి, నేర్పుతో కొన్ని వివాదాల పరిష్కారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆశించినంత ఆదాయం. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. స్థిరాస్తులపై సోదరులతో వివాదాల పరిష్కారం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

మిథునం

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వివాహ ప్రయత్నాలు అనుకూలం. స్నేహితులతో విభేదాల పరిష్కారం. వాహనాలు, గృహం కొంటారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

కర్కాటకం

ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. ఆదాయానికి లోటు ఉండదు. స్థిరాస్తి విషయంలో సమస్యలు తొలగుతాయి. యుక్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్యమైన  కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి. వ్యాపారులకు తగిన లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతం.

సింహం

కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగి అవసరాలు తీరతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు కొంతవరకు సర్దుకుంటాయి. స్థిరాస్తిపై కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు ఉంటాయి.

కన్య

కుటుంబ సమస్యల పరిష్కారం. ఆలోచనలకు కార్యరూపం. ఆదాయానికి ఇబ్బంది ఉండదు.  సన్నిహితులు, స్నేహితులతో వివాదాల సర్దుబాటు. ఇంటి నిర్మాణాలపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. వ్యాపారులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న  ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.

తుల

ఆకస్మిక ధనప్రాప్తి. అనుకున్న కార్యాలలో విజయం. పలుకుబడి కలిగిన వారు పరిచయమై సహకరిస్తారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధుల్లో కొంత ఒత్తిడులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులు శ్రమ పడాలి.

వృశ్చికం


వ్యయప్రయాసలు ఎదురైనా లెక్కచేయరు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఆదాయవ్యయాలు సమానం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.

 

ధనుస్సు


పరిచయాలు విస్తృతం. అవసరాలకు లోటు రాదు. ఇంటి పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యాలు విజయవంతం. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్త పోస్టులు లభించే అవకాశం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.

మకరం

పలుకుబడి కలిగిన వారి పరిచయం. ఆలోచనల  అమలు. సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తుల వ్యవహారాల్లో లబ్ధి. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు. ముఖ్య కార్యాలు దిగ్విజయం. రాబడి సంతృప్తికరం. వాహనసౌఖ్యం. వ్యాపారులకు పెట్టుబడులు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.

కుంభం

వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారతారు. ఆదాయం ఆశాజనకం. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. ఆత్మీయుల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నంత ఆదాయం. కఠిన సమస్యలు పరిష్కారం. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు శ్రమ తప్పదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు.

మీనం

పరిస్థితులు కొంతమేర అనుకూలిస్తాయి. ఆదాయం ఆశాజనకం. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. విద్యార్థుల్లో కొందరికి విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు కొంత గందరగోళం.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400