వారఫలాలు(సెప్టెంబర్6‌‌-12) : ఈ వారంలో బుధ గ్రహ సంచారంలో మార్పు.. 12 రాశుల వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయి..!

వారఫలాలు(సెప్టెంబర్6‌‌-12) : ఈ వారంలో బుధ గ్రహ సంచారంలో మార్పు.. 12 రాశుల వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయి..!

వారఫలాలు(సెప్టెంబర్​6‌‌-12):  ఈ వారంలో కన్యారాశిలో బుధుడు ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య నిపుణులు అందించిన సమాచారం ప్రకార ఈ వారంలో గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.. 

మేషరాశి :  ఈ రాశి కి చెందిన ఉద్యోగస్తులు ఈ వారంలో శుభవార్త వింటారు.  వృత్తి..వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  గతంలో ఉన్న ఫైనాన్స్​ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.  నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.  స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. 

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి.  డబ్బు పొదుపు చేస్తారు. . కుటుంబ వ్యవహారాలపై శ్రద్ద చూపాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది.  కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు ఉన్న కుటుంబసభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. వారం చివర్లో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. 

మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో  మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి.  కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.  వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.  ప్రేమ వ్యవహారాలు కాస్తంత ఇబ్బంది పెడతాయి. 

కర్కాటక రాశి:ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వృత్తి.. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు జాబ్​ ఆఫర్లు వస్తాయి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.  ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగిపోతాయి. 

సింహరాశి:   ఈ రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు.  కొత్త పెట్టుబడుల విషయంలోఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి.  అనవసరంగా మాట పడాల్సి రావచ్చు. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు.  విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు.  ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి.  వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. స్థిర ఆస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. గతంలో కంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఖర్చులు  పెరుగుతాయి.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది.  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

తులారాశి:  ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులు నెరవేరుతాయి.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  భూ లావాదేవీల వ్యవహారంలో సానుకూల ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు ఆశించన జాబ్​ లభిస్తుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.  వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.  ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. 

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది.  ఉద్యోగులకు పనిభారం పెరిగినా సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి.. వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి.  చేతి వృత్తుల వారికి  వారం మధ్యలో అనుకోకుండా ఆర్డర్లు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

ధనస్సురాశి:ఈ రాశి వారికి ఈ వారంలో  వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.  ఉద్యోగస్తులు ఆచితూచి వ్యవహరించాలి.  మీరు ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా సాగిపోతాయి.  ప్రేమ వ్యవహారాలు పరవా లేదనిపిస్తాయి.

మకర రాశి:  ఈ రాశి వారు ఈవారంలో ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోండి. ఆదాయం పెరగడానికి చేసే ఎటువంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాన్నిస్తుంది.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు చాలా వరకు బిజీగా మారిపోతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలు అమలు చేసి లబ్ధి పొందుతారు.ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్ప గించే అవకాశం ఉంది. అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. . ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.  ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కుంభరాశి: ఈ వారం ఈ రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఇప్పటి వరకు వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.  ప్రేమ... పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.పెళ్లి ప్రయత్నాలు ఫలి స్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు

మీనరాశి:  ఈ రాశి వారికి  అన్ని పనులలో  సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను, లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి.  ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.