'నాటకం' లాంటి డిఫరెంట్ అండ్ ఇంపాక్ట్ఫుల్ హిట్ తర్వాత హీరో ఆశిష్ గాంధీ, డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగన కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'డానీ'. 'వెల్కమ్ టు లవ్ జంగిల్' అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆడియెన్స్, ట్రేడ్ సర్కిల్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. కొల్లి గోపాల కృష్ణ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ గోగణ పిక్చర్స్ బ్యానర్స్‌పై రిజ్వాన్, ఖుషి, సుధాకర్ గోడ సంయుక్తంగా ఈ రా అండ్ రస్టిక్ రొమాంటిక్ క్రైమ్ డ్రామాను నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ మూవీ 'ఫస్ట్ స్ట్రైక్' సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత బోల్డ్‌గా, రా అండ్ రస్టిక్‌గా డిజైన్ చేసిన విజువల్స్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మనిషి బలహీనతలు, అలవాట్లు ఒకవైపు.. నిజమైన ప్రేమ మరొకవైపు. ఈ రెండింటి మధ్య నడిచే నరకప్రాయమైన సంఘర్షణే ఈ 'డానీ' కథాంశం. తన వ్యసనాలు, అలవాట్ల వల్ల నాశనమవుతున్న ఒక యువకుడి జీవితం.. ప్రేమలో పడ్డాక ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ ప్రేమను గెలుచుకోవడానికి అతడు ఎంతటి ప్రమాదకరమైన 'లవ్ జంగిల్'లో పోరాడాల్సి వచ్చింది అనేది దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన ఎంతో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు.
►ALSO READ | 'దేవుడే వారిని చల్లగా చూడాలి'.. తనుశ్రీ దత్తా ఆరోపణలపై నానా పటేకర్ కొడుకు కౌంటర్!
ఇందులో ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాలోని బోల్డ్నెస్తో పాటు తీవ్రమైన భావోద్వేగాలను ప్రతిబింబిస్తోంది. ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ క్రేజీ అండ్ బోల్డ్ లవ్ డ్రామాను నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఎంతో ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
