కుర్రోళ్లు కుమ్మేశారు : బంగ్లా టార్గెట్-322

కుర్రోళ్లు కుమ్మేశారు : బంగ్లా టార్గెట్-322

టాంటన్‌ : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 రన్స్ చేసింది. ప్రారంభంలోనే  వికెట్ కోల్పోయినా.. కుర్ర ప్లేయర్లు కుమ్మేశారు. గేల్, రస్సెల్ డకౌట్ అయినప్పటికీ..లివీస్, హోప్, హెట్ మేయర్, హోల్డర్ రాణించడంతో ..బంగ్లా ముందు బిగ్ టార్గెట్ ను ఉంచింది విండీస్. హెట్ మేయర్ హిట్టింగ్ కు రెండు సార్లు బాల్ స్టేడియం బయటపడింది. క్రీజులో ఉన్నంతసేపు చిచ్చరపిడుగుల రెచ్చిపోయాడు. 25 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసుకున్న హెట్ మేయర్ ఆ తర్వాత బాల్ కి ఔట్ అయ్యాడు.

వెస్ట్ ఇండీస్ ప్లేయర్లలో..లివీస్(70), హోప్(96), నికోలస్ పూరణ్(25), డారెన్ బ్రావో(19), హెట్ మేయర్(50), హోల్డర్(33) రన్స్ తో రాణించారు.

బంగ్లా బౌలర్లలో..ముస్తపిజుర్(3), షకీబ్(2), సైపుద్దీన్(3) వికెట్లు తీశారు.