సంతోషంగా ఉండడం ఎలా..? నిజమైన సంతోషం అంటే ఏమిటి?

సంతోషంగా ఉండడం ఎలా..? నిజమైన సంతోషం అంటే ఏమిటి?

తెలిసిన వాళ్లను 'ఎలా ఉన్నావ్?' అని అడిగితే.. 'నాకేం చాలా బాగున్నా..' అని వెంటనే చెప్తారు. కానీ నిజానికి సంతోషంగా ఉండటం అంటే ఏమిటో వాళ్లకు తెలియకపోవచ్చు. డబ్బు, ఇల్లు, కుటుంబం, స్నేహితులు... ఉంటే సంతోషంగా ఉన్నట్లే అనుకుంటారు చాలామంది. కానీ ఆధ్యాత్మిక భావనలోనే కాదు, మామూలుగా కూడా సంతోషంగా ఉండటం అంటే వేరు. అందుకోసం... చేసే పనిని ఇష్టంతో చేయాలి. గాలి, నీరు, భూమి, ఆకాశం, తిండి... ఇలా సృష్టిలోని ప్రతిదాన్ని  ఆరాధించాలి.

• గతాన్ని తలుచుకుంటా, భవిష్యత్తు గురించి కలలు కంటూ వర్తమానాన్ని పట్టించుకోకుండా వదిలేయకూడదు. ప్రతి నిమిషం ఇష్టంతో, సంతోషంగా బతకాలి. టాలెంట్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. లక్ష్యం ఎంచుకొని దాని వెంట పరుగెత్తకూడదు.
లక్ష్యాన్ని సాధించడాన్ని కూడా ఎంజాయ్ చేయాలి.

• బద్దకం లేకుండా, కష్టపడాలి. సంతోషంగా ఉండటం అంటే సుఖంగా బతకడం కాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే సంతోషం. కోపం, అసూయ, ద్వేషం.... లాంటి వాటిని వదిలేసి, అందరితో ప్రేమగా ఉండాలి. సంతోషాన్ని బయట ప్రపంచంలో వెతకడం కంటే, లోపలే వెతుక్కోవాలి. ఎందుకంటే సంతోషం అనేది ఎవరికి వాళ్లు సొంతంగా పొందేది.