స్వప్నశాస్త్రం : కలలో చెత్తకుప్ప కనపడితే.. దాని సంకేతం ఏమిటో తెలుసా..

స్వప్నశాస్త్రం :  కలలో చెత్తకుప్ప కనపడితే.. దాని సంకేతం ఏమిటో తెలుసా..

కలలు కనడం చాలా సాధారణ విషయం. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. జంతువులు సైతం కలలు కంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కొన్ని కలలు మాత్రం చాలా భయానకంగా ఉంటాయి. వాటి గురించి ఆలోచించాలనే తలపే మనల్ని భయకంపితుల్ని చేస్తుంది. కలలో చాలా సార్లు చెత్తకుప్ప కనపడుతుంది. . అయితే.. కలలో చెత్తకుప్ప  కనిపించడం దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్నశాస్త్రం  ప్రకారం ప్రతి కల మనల్ని భవిష్యత్తు సంఘటనల వైపు నడిపిస్తుందట. భవిష్యత్ లో జరగాల్సిన విషయాలను కొన్ని సంకేతాల రూపంలో ముందే హెచ్చరిస్తుంది. అందుకే మెలకువ వచ్చాక కూడా కొన్ని కలలు (Dreams) మనల్ని వెంటాడుతూ ఉంటాయి. . 

స్వప్న శాస్త్రం ప్రకారం ..  కలలో చెత్త కుప్పను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏదో ఆపద వస్తుందని ముందే హెచ్చరికగా భావించవచ్చని  పండితులు చెబుతున్నారు.  ఏదో నెగిటివ్​ ఎనర్జీ మిమ్మలను త్వరలో వెంబడించే అవకాశం ఉందని సంకేతమంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు. కలలో చెత్త కుప్పను చూసినట్లయితే జీవితంలో అడ్డంకులు, మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలంటున్నారు పండితులు. అలాగే అనవసర విషయాలకు చాలా దూరంగా ఉంటే బెటర్​ .
 
డ్రీమ్​ సెన్స్​ ప్రకారం కలలో చెత్త కుప్పను కనపడితే  ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని  సూచిస్తుంది. ఇది మానసిక ఒత్తిడి.. ఆందోళన ... గందరగోళానికి సంకేతమని స్వప్నశాస్త్ర  గ్రంథాల ద్వారా తెలుస్తుంది.  అలా చెత్తకుప్ప కలలో కనపడినపుడు వచ్చే ఆపద నుంచి ఉపశమనం పొందడానికి  సోమవారం రోజున రుద్రాభిషేకం చేసి.. బిల్వ పత్రాలతో పరమేశ్వరుడిని పూజించాలని చెబుతున్నారు పండితులు. 

చెత్త కుప్ప కలలో కనపడితే ఇబ్బందులు.. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయని అంటున్నారు.  అలాంటి వారు  వారి బిహేవియర్​ మార్చుకోవాలి. ఇంకా ఆరోగ్యసమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.  శారీరక శ్రమ పెరగుతుంది.   గతంలో చేసిన పనుల్లో ఏమైనా లోపాలున్నాయా .. అనే విషయాలను ప్రశాంతంగా ఆలోచించుకోవాలి.  ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవాలి.  రోజూ దీపారాధన చేసి.. తులసి మొక్కకు పసుపు.. కుంకుమ.. అక్షింతలు సమర్పించాలి. 

కలలో చెత్త కుప్పను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనలను హెచ్చరించేందుకు ఒక సంకేతంగా భావించాలి.   ఇక కలలో చెత్తను శుభ్రం చేస్తున్నట్లు కనపడితే.. ఆవ్యక్తికి మంచి జరుగుతుందనే సంకేతమని పండితులు చెబుతున్నారు.  జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయని .. అప్పటి వరకు ఉన్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.