
ఇప్పుడున్న సిటీ లైఫ్ కు ఏసీ లేకుంటే అస్సలు నడవదు. సిటీ ఏంటి... విల్లేజ్ లలో కూడా ఏసీ తప్పనిసరి అయిపోయింది. చెట్లు తగ్గుతుండటం.. మండుతున్న ఎండలు.. పెరుగుతున్న పొల్యుషన్, ఉష్ణోగ్రత కారణంగా ఏసీ లేకుండా కాసేపు ఉండలేని పరిస్థితి. ఫ్యాన్ ఉన్నప్పటికీ దాన్నుంచి వచ్చే వేడిగాలి కంటే అలా బయట వెళ్లి కూర్చోవటం బెటర్ అనిపిస్తుంటుంది. అయితే ఏసీ వాడే వాళ్లు గుర్తించుకోవాల్సిన అంశం ఒకటుంది. ఏసీని ఎలా పడితే అలా వాడితే కుదరదు. ఏ టెంపరేచర్ సేఫ్.. లిమిట్ దాటితే ఏమవుతుందో తెలుసుకోకుంటే నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఏసీని ఎలా వాడాలో తెలుసుకుందాం.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. ఇళ్లల్లో కానీ.. ఆఫీసులలో కానీ ఏసీ టెంపరేచర్ 24°C నుంచి 26°C మధ్య ఉంటే మంచిదట. ఈ టెంపరేచర్ రేంజ్ మన బాడీకి మంచిదని.. అదే విధంగా కరెంటు కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు.
ఏసీ వాడే వారు కొందరు.. చాలా కోల్డ్ వెదర్ ఉండాలని కోరుకుంటారు. అందుకోసం 16 డిగ్రీస్ వరకు తగ్గిస్తుంటారు. అయితే 24°C నుంచి 26°C కంటే తక్కువ ఉంటే ఒక్కో డిగ్రీ సెల్సియస్ ( 1°C) తగ్గే కొలది 6 శాతం కరెంటు వినియోగం ఎక్కువ అవుతందట. అంటే ప్రతీ ఒక్క డగ్రీకి 6 శాతం కరెంటు ఖర్చు అవుతుంది.
మన బాడీ సైకాలజీని అర్థం చేసుకోవాలి:
మన శరీరం వాతావరణ పరిస్థితులను బట్టీ టెంపరేచర్ ను ఇంటర్నల్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. బయట చలిగా ఉన్నపుడు వేడి ఉత్పత్తి చేస్తూ.. వాతవరణం వేడిగా ఉన్నపుడు లోపలి ఉష్ణోగ్రతను బయటకు పంపి బాడీని చల్లగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే ఇండియన్స్ బాడీ 40-60 శాతం తేమతో 24–25°C టెంపరేచర్ ను కంఫర్ట్ గా ఫీలవుతుందట. అంతకు మించి రూమ్ టెంపరేచర్ కూల్ అయితే బాడీని వేడి చేసేందుకు మరింత శక్తి కావాల్సి వస్తుంది. అంతేకాకుండా గొంతు గరగర, జలుబు, లేదా శ్వాస సంబంధిత ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది.
కరెంటు ఇంత ఆదా అవుతుందా..?
ఏసీ టెంపరేచర్ 18°C or 20°C మధ్య ఉంటే చాలా కంఫర్ట్ గా ఉుంటుంది. కానీ ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కంప్రెసర్ పైన మరింత లోడ్ పడుతుంది. దీంతో ఎక్కువ కరెంటు ఖర్చు అవుతుంది. కొన్ని సార్లు కంప్రెషర్ పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దానికి భిన్నంగా 24–25°C దగ్గర మెయింటైన్ చేస్తే 30 శాతం కరెంటు ఆదా చేయవచ్చునని అంటున్నారు.
విష వాయువులను తగ్గించవచ్చు:
ఏసీ టెంపరేచర్ ను ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ మొత్తంలో విషవాయువులు విడుదల అవుతాయి. దీని వలన గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) చాలా పెద్ద సమస్యగా మారింది. ఏసీని ప్రాపర్ గా వాడటం వలన కరెంటు, డ బ్బు ఆదా చేయడంతో పాటు కార్బన్ వాయువుల ఉత్పత్తిని తగ్గించవచ్చు. జనాలు లక్షల సంఖ్యలో ఏసీ టెంపరేచర్ ను 24°C మెయింటైన్ చేస్తే.. కార్బన్ డై ఆక్సైడ్ (CO₂) ఉత్పత్తిని తగ్గించవచ్చు.
ఏసీ టిప్స్:
ఈ కింది టిప్స్ పాటిస్తే ఏసీని సరిగ్గా వినియోగించవచ్చు:
- ఏసీ వాడుతున్నపుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి
- ఎయిర్ ఫ్లో స్మూత్ గా ఉండేందుకు రెగ్యులర్ గా ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి
- నైట్ టైమ్ లో పవర్ సేవింగ్ మోడ్ లేదా స్లీప్ మోడ్ లో ఉంచుకోవాలి.