ఇంట్లో చెత్తబుట్ట ఎక్కడ, ఏ దిశలో పెట్టాలో తెలుసా ? ఇలా చేస్తే లక్ష్మిదేవి కరుణిస్తుంది..!

 ఇంట్లో చెత్తబుట్ట ఎక్కడ, ఏ దిశలో పెట్టాలో తెలుసా ?  ఇలా చేస్తే లక్ష్మిదేవి కరుణిస్తుంది..!

ఇంట్లో చెత్తబుట్టను ఎక్కడ పెట్టాలి, వాస్తు ప్రకారం ఏయే దిశలు మంచివి అనే విషయాలు చాల మందికి తెలియదు.  అయితే వాస్తు ప్రకారం ఇంట్లో చెత్తబుట్ట పెట్టడానికి నైరుతి దిశ అత్యంత ఉత్తమమైనది. ఈ దిశలో చెత్తబుట్ట పెట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకోవచ్చని నమ్ముతారు. అంతేకాకుండా, ఈ వైపు ఎక్కువ మంది తిరగరు కాబట్టి చెత్త వాసన ఇల్లంతా రాకుండా ఉంటుంది.

 నైరుతై కాకుండా వాయువ్య మూలను కూడా చెత్తబుట్ట ఉంచడానికి మంచి ప్రదేశంగా భావిస్తారు. ఇవే కాకుండా దక్షిణం, పడమర దిశల్లో కూడా చెత్తబుట్టను పెట్టుకోవచ్చు.

చెత్తబుట్టను ఎక్కడ పెట్టకూడదు?
ఈశాన్య మూల (North-East): దేవుడి గదికి, సానుకూల శక్తికి ఈశాన్య మూల చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తబుట్ట పెట్టకూడదు. ఒకవేళ పూజ గది శుభ్రం చేసినప్పుడు వచ్చే చెత్తను ఒక సంచిలో వేసి పారుతున్న నీటిలో కలపాలి.

ఉత్తరం,  తూర్పు దిశలు.. ఈ రెండు దిశలలో కూడా చెత్తబుట్టలను ఉంచడం మంచిది కాదు. ఇలా చేస్తే ఇంటిలో ఉండే సానుకూల శక్తి తగ్గిపోయి, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి పెరుగుతాయని నమ్ముతారు.

  మెయిన్ డోర్ దగ్గర లేదా సరిగ్గా దానికి ఎదురుగా చెత్తబుట్ట అసలు పెట్టకూడదు. ఎందుకంటే సానుకూల శక్తి, దేవుడు ముఖ్య  ద్వారం నుండే  ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. కాబట్టి మెయిన్ డోర్ దగ్గర ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.