ఆరోగ్యం కోసం డయాబెటిస్​ ఉన్నవాళ్లు ఏం తినాలంటే..

ఆరోగ్యం కోసం డయాబెటిస్​ ఉన్నవాళ్లు ఏం తినాలంటే..

డయాబెటిస్​ ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర పెరగకుండా చూసుకునేందుకు చాలా జాగ్రత్తపడతారు. బ్రేక్​ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం శ్నాక్, రాత్రి భోజనం​.. ఏదైనా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ కోసం చూస్తారు.  ఆరోగ్యం కోసం వీళ్లు ఏం తినాలో చెప్తున్నారు డయాబెటిస్​ స్పెషలిస్ట్​ అశోక్​ కుమార్ జింగాన్.

ఓట్స్​లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్​ ఎక్కువ ఉంటాయి. ఇవి  రక్తంలో చక్కెరని పీల్చుకుంటాయి. దాంతో షుగర్ లెవల్స్ పెరగవు. అందుకని  బ్రేక్​ఫాస్ట్​గా ఓట్స్​తో అంబలి లేదా జావ చేసుకుని తాగితే మంచిది. లేదంటే ఓట్స్​ని పండ్లు, చియా సీడ్స్​తో కలిపి తిన్నా  బాగుంటుంది. చియా సీడ్స్​ని నీళ్లలో నానబెట్టి తినాలి. వీటిలోని ఫైబర్​ చక్కెరని కంట్రోల్​లో ఉంచుతుంది.

  • బ్రేక్​ఫాస్ట్ టైంలో గుడ్డు తినొచ్చు. దీనిలో క్యాలరీలు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువ. అట్లనే శనగ పిండితో అట్లు వేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. ఇందులోని ఫైబర్, మెగ్నీషియం చక్కెర శాతం పెరగకుండా చూస్తాయి. 
  • ప్రొబయాటిక్స్​ ఉండే పెరుగు తింటే పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.  పెరుగులోని బ్యాక్టీరియా  లాక్టోజ్​ అనే చక్కెరని వాడుకుంటుంది.
  • దాంతో బ్లడ్ షుగర్ బ్యాలెన్స్​లో ఉంటుంది.  వీటితో పాటు శ్నాక్​గా  బాదం, జీడిపప్పు, వాల్​నట్స్ వంటివి తిన్నా కూడా శరీ రానికి అవసరమైన ప్రొటీన్, ఫైబర్ అందుతాయి.