మోడ్రన్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో..అష్టలక్ష్మి వస్తోంది

మోడ్రన్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో..అష్టలక్ష్మి వస్తోంది

నటిగానే కాక ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గానూ రాణిస్తోంది నిహారిక కొణిదెల. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా వస్తోంది. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్’ అనేది ట్యాగ్‌‌‌‌లైన్. వరుణ్ కోరుకొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. సోమవారం నిహారిక పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె మోడ్రన్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌గా కనిపిస్తోంది.

తన వెనుక డాలర్ ఇమేజ్‌‌‌‌ ఉంది. అష్టలక్ష్మి పాత్రలో నిహారిక కనిపించనుందని రివీల్ చేశారు. తనది  యాక్షన్ డ్రివెన్ పాత్ర అని,  ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు.  ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.