వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. గ్రూప్ చాట్ చేసేవారికి ఇది బెస్ట్ వన్. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్ లో కొత్త వారు జాయిన్ అయితే పాత మేసేజ్ లను చూడలేరు. అటువంటి వారికోసమే మెటా..గ్రూప్ మేసేజ్ హిస్టరీ అనే కొత్త ఫీచర్ ను అందిస్తోంది.
ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్‌లో కొత్తగా ఎవరైనా చేరితే, వారు పాత మెసేజ్‌లను చూడలేకపోయేవారు. దీంతో మిగతా సభ్యులు స్క్రీన్‌షాట్లు పంపడం లేదా మెసేజ్‌లను మాన్యువల్‌గా ఫార్వర్డ్ చేయడం చేసేవారు. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పడింది. గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ ద్వారా అడ్మిన్లు లేదా గ్రూప్ సభ్యులు ఇటీవలి మెసేజ్‌లను కొత్తవారితో నేరుగా షేర్ చేయవచ్చు.
అడ్మిన్లు, గ్రూప్ సభ్యులు ఇటీవలి మేసేజ్ లను కొత్తవారితో పంచుకోవడం ద్వారా కొత్త సభ్యులను త్వరగా కలుపుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. టీం వర్క్ ను స్పీడప్ చేస్తుంది. ఈ అప్డేట్ వాట్సాప్ మేసేజ్ ల మాదిరిగా నే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ట్ అందిస్తుంది. మీరు చేసే మేసేజ్ లు, చాటింగ్ లకు ప్రైవసీ అందిస్తుంది. యూజర్లు ఇంతకుముందులాగా స్క్రీన్ షాట్ లు, మాన్యువల్ మేసేజ్ లను ఫార్వార్డ్ చేయాల్సిన అవసరం లేదు.
100 వరకు మేసేజ్ లు పంపొచ్చు..
గ్రూప్ మేసేజ్ హిస్టరీ ఫీచర్ ద్వారా ఒక గ్రూప్ లో కొత్తగా చేరిన సభ్యుడికి 25 నుంచి 100 మేసేజ్ లు పంపించవచ్చు. ఇది కొత్త వారికి త్వరగా గత విషయాలను తక్కువ సమయంలో తెలియజేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ను నిర్వాహకులు కోరుకుంటే డిసేబుల్ చేయొచ్చు. తిరిగి ఎనేబుల్ చేసుకోవచ్చు.
టైమ్ స్టాంప్‌తో.. త్వరగా గుర్తించేలా..
ఈ ఫీచర్ ద్వారా షేర్ చేసిన మెసేజ్‌లు స్పష్టమైన టైమ్ స్టాంప్ తో కనిపిస్తాయి. సాధారణ మెసేజ్‌ల కంటే ఇవి కొంచెం భిన్నంగా కనిపించడం వల్ల కొత్త సభ్యులు అవి షేర్ చేసిన హిస్టరీ అని సులభంగా గుర్తించగలరు.
గ్రూప్ చాట్‌లను మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా ఆఫీస్ గ్రూప్‌లు, స్కూల్ గ్రూప్‌లు, కమ్యూనిటీ చాట్‌లకు ఇది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు.
