V6 News

వాట్సాప్ లో స్పామ్ సమస్యకు చెక్... ఆటో ఆర్గనైజ్డ్ బిజినెస్ చాట్

వాట్సాప్ లో స్పామ్ సమస్యకు చెక్... ఆటో ఆర్గనైజ్డ్ బిజినెస్ చాట్

వాట్సాప్‌‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్​తో చేసే పర్సనల్​ చాట్‌‌లతో పాటు వివిధ వ్యాపార సంస్థల నుంచి వచ్చే మెసేజ్​లు కూడా ఒకే చోట కనిపిస్తుంటాయి. దీనివల్ల ముఖ్యమైన మెసేజ్‌‌లను గుర్తించడం ఒక్కోసారి కష్టమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌‌లో ఈ సరికొత్త ఆప్షన్ కనిపిస్తోంది. 

బిజినెస్ అకౌంట్స్​ నుంచి మెసేజ్​లన్నీ 24 గంటల తర్వాత ఆటోమెటిక్‌‌గా ఒక స్పెషల్​ సెక్షన్​కి వెళ్లిపోతాయి. దీంతో ప్రమోషనల్ మెసేజ్‌‌లు, వ్యాపార ప్రకటనలు మీ పర్సనల్​ చాట్‌‌ల మధ్య రాకుండా ఉంటాయి. దీంతో స్పామ్ మెసేజ్​ల సమస్య తగ్గుతుంది. యూజర్లకు తమ అకౌంట్​పై మరింత కంట్రోల్ వస్తుంది. 

ఆర్డర్ వివరాలు లేదా కస్టమర్ సపోర్ట్ వంటి ముఖ్యమైన బిజినెస్ చాట్‌‌లను వెతకడం ఇప్పుడు మరింత ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్​ దశలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.