టెలిగ్రామ్ ఫీచర్స్తో వాట్సాప్.. ఇక నంబర్ కనిపించదు

టెలిగ్రామ్ ఫీచర్స్తో వాట్సాప్.. ఇక నంబర్ కనిపించదు

వాట్సాప్ ఎప్పుడూ కొత్త ఫీచర్స్ పై పనిచేస్తుంది. సెక్యూరిటీ పరంగా ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ ను తీసుకొస్తుంటుంది. ఇప్పుడు ఛానెల్స్ అనే కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచర్ టెలిగ్రామ్ ఫీచర్ ను పోలి ఉంటుందని సమాచారం. 

ఇదివరకు కూడా  టెలిగ్రామ్ యానిమేటెడ్ ఎమోజీ ఫీచర్ ను వాట్సాప్ కాపీ కొట్టింది. ఇప్పుడు తీసుకొస్తున్న ఛానెల్స్ అప్ డేట్ లో.. ఏ గ్రూప్ లోనైనా ఇన్ వైట్ గ్రూప్ ద్వారా జాయిన్ అయితే.. ఆ గ్రూప్ సభ్యులకు ఫోన్ నెంబర్ కనిపించదు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ వాట్సాప్ బీటా టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. త్వరలో వినియోగంలోకి తీసుకురానుంది వాట్సాప్. అయితే, మొదట ఐఓఎస్ (యాపిల్) యూజర్లకు అందుబాటులోకి రానుంది.