వాట్సప్ కొత్త అప్ డేట్ అద్దిరిపోయిందిగా.. రెండు అకౌంట్లు ఇకపై ఒకే యాప్​లో

వాట్సప్ కొత్త అప్ డేట్ అద్దిరిపోయిందిగా.. రెండు అకౌంట్లు ఇకపై ఒకే యాప్​లో

వాట్సప్  యూజర్స్​ని ఆకట్టుకోవడానికి ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల స్క్రీన్​షేరింగ్, లాక్​చాట్, మల్టీ డివైజ్​ ఫీచర్లు తీసుకొచ్చిన వాట్సప్​ తాజాగా మరో న్యూ ఇంట్రెస్టింగ్ అప్​డేట్​తో ముందుకొచ్చింది. 

ఇప్పటిదాకా ఒక ఫోన్లో ఒకే వాట్సప్ అకౌంట్​ని లాగిన్​ చేసే అవకాశం ఉండేది. కానీ ఈ కొత్త ఫీచర్​తో ఒక మొబైల్ లో​ రెండు వాట్సప్ లను లాగిన్​ చేయవచ్చు. దాని వివరాలివే..ఒక వ్యక్తి దగ్గర అఫీషియల్, పర్సనల్ వాట్సప్ లు ఉంటే.. వేరే అకౌంట్​లోకి లాగిన కావాలంటే మరో ఫోన్​ అయినా ఉండాలి లేదా క్లోన్డ్​ వాట్సప్ యాప్​ అయినా యూజ్​ చేయాల్సి ఉంటుంది. 

రెండు మొబైల్స్​ వాడటం అంటే కష్టసాధ్యమయ్యే పని. క్లోన్డ్​ వాడాలంటే సెక్యూరిటీ ఇష్యూస్​ ఉంటాయేమోననే భయం. వీటికి స్వస్తి పలకడానికే మెటా సంస్థ ఈ కొత్త ఫీచర్​ ప్రవేశపెట్టింది. దీని సాయంతో ఒకే వాట్సప్ లో రెండు వేర్వేరు అకౌంట్లు ఉపయోగించవచ్చు. 

ఫీచర్​ అందుబాటులోకి వచ్చిన వారు యాప్​లోకి వెళ్లి క్యాఆర్​ కోడ్​ ఆప్షన్ దగ్గర ఉన్న బాణం గుర్తు సాయంతో మరో అకౌంట్​లోకి యాడ్​ కావచ్చు. దీంతోనే మరో అకౌంట్​కి మారవచ్చు. ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్​ త్వరలో అందరికీ వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు మెటా సంస్థ యాజమాన్యం ప్రకటించింది.