ట్యాబ్లేట్స్ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ తో పాటు ఈ ఎర్ర గీతను గమనించారా.. సగం మందికి తెలియదు..

ట్యాబ్లేట్స్ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ తో పాటు ఈ ఎర్ర గీతను గమనించారా.. సగం మందికి తెలియదు..

మనం మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు కొనేటప్పుడు వాటి పేరు, ఎక్స్పైరీ  డేట్ చూసుకుంటాం. కానీ మందుల ప్యాకెట్‌పై ఉండే ఎర్రటి నిలువు గీతను మాత్రం చాలామంది పట్టించుకోరు. అది కేవలం డిజైన్ కోసం వేసిన గీత కాదు. కొన్ని మందులను ఎలా ఉపయోగించాలో చెప్పే ఒక ముఖ్యమైన గుర్తు. అసలు ఈ ఎర్ర గీత ఎందుకు ఉంటుంది ? దాని వెనుక ఉన్న విషయం ఏమిటో తెలుసా... 

మందులపై ఎర్ర గీత  
కొన్ని మందుల ప్యాకెట్లపై ఎడమ వైపు ఎర్రటి నిలువు గీత ఉంటుంది. ఇలాంటి మందులు సాధారణంగా డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌తోనే కొనాలి. అంటే, ఆ మందులను మనకు నచ్చినట్లు సొంతంగా కొనుక్కొని వేసుకోవడం సరైన పద్ధతి కాదు. డాక్టర్  సలహా మేరకే వాటిని ఉపయోగించాలి. ఎందుకంటే తప్పుగా మందులు వాడితే కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ప్యాకెట్‌పై కనిపించే ప్రతి ఎర్రటి గుర్తు  ఒకే అర్ధం ఉండదు. మందులపై ఇతర హెచ్చరికలు, గుర్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి రంగును మాత్రమే చూసి మందుల గురించి ఒక నిర్ణయానికి రావద్దు.

ఎక్స్పైరీ డేటుతో పాటు ఎం  చూడాలంటే 
*మందులు కొనేటప్పుడు కేవలం వాటి పేరు, ధర మాత్రమే చూసి తీసుకోకండి. ఈ విషయాలను కూడా తప్పక గమనించండి.
1. మందు ఎక్స్‌పైరీ డేట్  చూడండి.
2.  డాక్టర్ రాసిచ్చిన మందులేనా కాదా అని చెక్ చేసుకోండి.
3. ఎంత మోతాదులో తీసుకోవాలో అడిగి తెలుసుకోండి.
4. ప్యాకెట్‌పై ఉన్న సూచనలు, జాగ్రత్తలను చదవండి.
5. మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోనే ఉపయోగించాలా అనే విషయాన్ని తెలుసుకోండి.

పాత ప్రిస్క్రిప్షన్‌తో మళ్లీ మందులు కొనొచ్చా?
చాలామంది ఇంతకుముందు జబ్బు చేసినప్పుడు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ను తీసుకెళ్లి, అదే మందులను మళ్లీ కొని వేసుకుంటుంటారు. కానీ ఒకప్పుడు వచ్చిన ఆరోగ్య సమస్య మళ్లీ వచ్చినా, అదే మందులు పనిచేస్తుందని చెప్పలేం. ప్రతి ఆరోగ్య సమస్యకు ఒకే మందు సరిపోదు. అందుకే డాక్టరుని సంప్రదించకుండా సొంతంగా మందులు వేసుకోవద్దు. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే మందులను డాక్టర్ సూచన లేకుండా ఉపయోగించకండి.

 మందులు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్  చూడటం ఎంత ముఖ్యమో, వాటిపై ఉన్న సూచనలు, హెచ్చరికలను చదవడం కూడా అంతే ముఖ్యం. ఏ మందు వాడాలో, ఎంత మోతాదులో తీసుకోవాలో డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. చిన్న నిర్లక్ష్యం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మందులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.