ప్రొటీన్‌‌  కబాబ్స్​

ప్రొటీన్‌‌  కబాబ్స్​

ప్రతి ఒకరి డైట్‌‌లో న్యూట్రియెంట్స్​, ప్రొటీన్స్‌‌, ఫైబర్‌‌‌‌ సమానంగా ఉండాలి. పిల్లల విషయానికి వస్తే వాళ్లకు ప్రొటీన్‌‌ చాలా అవసరం. ఆకుకూరలు తినమన్నా, పాలు తాగమన్నా.. వద్దంటే వద్దని అంటారు. అలాంటప్పుడు వాళ్లు ఇష్టపడేలా వండిపెట్టాలి అంటోంది న్యూట్రిషనిస్ట్‌‌ పూజా మఖిజ. “ ప్రొటీన్‌‌ తొందరగా అరగదని, అది బాడీ బిల్డర్స్‌‌కి మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు చాలామంది తల్లులు. కానీ, ప్రొటీన్‌‌ అందరికీ అవసరమే. ఈ హైప్రొటీన్‌‌ కబాబ్స్​ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు” అన్నారామె. 
కబాబ్స్​ కోసం కావాల్సినవి: 
శనగలు (నానబెట్టినవి), అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మసాలాలు (చాట్‌‌మసాలా, మిరియాలపొడి, ఇంగువ, ఉప్పు, ధనియాలపొడి, పసుపు, చిల్లీ ఫ్లేక్స్‌‌), కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిగడ్డ, నువ్వులు, నూనె
తయారీ: ఒక గిన్నెలో నానబెట్టిన శనగలు, అల్లం, వెల్లుల్లి, మసాలాలు, పచ్చిమిర్చి తరుగువేసి మెత్తటి పేస్ట్‌‌లా కలపాలి. కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిగడ్డ తరుగు, నువ్వులు వేసి అన్నీ బాగా కలపాలి. తర్వాత చిన్న ఉండలు  చేసి కబాబ్స్​లా వత్తాలి. నూనె వేడిచేసి కబాబ్స్​ను ఎర్రగా ఫ్రై చేయాలి.