OTT Thriller: సైలెంట్‌గా ఓటీటీలోకి విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Thriller: సైలెంట్‌గా ఓటీటీలోకి విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విజయ్ సేతుపతి హీరోగా నటించిన రీసెంట్ మూవీ ‘ఏస్‌‌‌‌’(ACE). అరుముగ కుమార్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సేతుపతికి జంటగా రుక్మిణీ వసంత్‌‌‌‌ నటించింది. మే 23న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ.. సడెన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రైమ్ వీడియోలో తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

ఈ మిస్టరీ థ్రిల్లర్లో దివ్య పిళ్లై, యోగిబాబు,‘పెళ్లి’పృథ్వి, బి.ఎస్ అవినాష్, ముత్తుకుమార్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. విజ‌య్ సేతుప‌తి కెరీర్లో 51వ మూవీ ఇది. 2023లోనే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైంది. డైరెక్టర్ ఆరుముగకుమార్ గతంలో విజయ్ సేతుపతితో కలిసి ఓరు నల్ల నాల్ పాతు సోల్రెన్ చిత్రంలో పనిచేశారు. శ్రీ పద్మిణి సినిమాస్ సంస్థ అధినేత బి.శివ ప్రసాద్ తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు. 

కథేంటంటే:

బోల్ట్‌ కాశీ (విజయ్‌ సేతుపతి) కొన్ని సంఘటనల కారణంగా జైలు జీవితం గడుపుతాడు. జైలు జీవితం గడిపాక బుద్దిగా బ్రతకాలని డిసైడ్ అవుతాడు. అందుకోసం ఏదైనా పనిచేసుకోవాలని మలేషియాకు వెళతాడు. అక్కడ జ్ఞానందం (యోగి బాబు) వద్ద ఆశ్రయం పొందుతాడు. కల్పన (దివ్యా పిళ్లై) హోటల్‌లో చెఫ్‌గా బోల్ట్ కాశీ జాయిన్ అవుతాడు. కల్పన ఈ హోటల్ కోసం తీసుకున్న లోన్ కట్టుటకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది.

ఈ క్రమంలో బోల్ట్ కాశీ మలేషియాలో ఉండే రుక్మిణి (రుక్మిణి వసంత్) ను ప్రేమిస్తాడు. అయితే, రుక్మిణి కూడా తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతుంటుంది. ఇలా ఒక్కొక్కరు మలేషియాలో ఒక్కో విధమైన కారణాలతో బ్రతికేస్తుంటారు. అయితే, అనుకోకుండా మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్)తో బోల్ట్‌ కాశీ శత్రుత్వం పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే బోల్ట్‌ కాశీ బ్యాంకులో దోపీడీ చేయడానికి సిద్దపడాల్సి వస్తోంది. 

ఇంతకు బోల్ట్‌ కాశీకి వచ్చిన కష్టమేమిటి? మలేసియా ఇల్లీగల్ డాన్ ధర్మతో బోల్ట్‌ కాశీకి ఉన్న సమస్య ఏంటీ? ఇండియాలో బోల్డ్ కాశీ అస‌లు జైలుకు ఎందుకు వెళ్లాడు? బ్యాంక్ వాళ్ళ నుండి హోటల్ నిలబెట్టుకోవడానికి కల్పన ఎలాంటి ప్లాన్ వేసింది? రుక్మిణి కూడబెట్టుకున్న డబ్బులతో తన ఇల్లుని విడిపించుకుందా? లేదా ఏదైనా స్కామ్ చేసిందా? ఈ కేసులో బోల్ట్‌ కాశీ పోలీసులకు చిక్కాడా? పోలీసుల్ని, ధర్మ గ్యాంగ్‌ను కాశీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే!