Naa Saami Ranga: అంజిది కిష్టయ్యది విడదీయని బంధం..ఎమోషనల్ సాంగ్ రిలీజ్

Naa Saami Ranga: అంజిది కిష్టయ్యది విడదీయని బంధం..ఎమోషనల్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్‌ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డాన్స్ మాస్టర్ విజయ్‌ బన్నీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ అంజి అనే కీలక పాత్ర‌లో కనిపించనున్నాడు. 

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి..విజిల్ థీమ్ సాంగ్ పాట రిలీజ్ చేశారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ కీరవాణి లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ఈ పాట అల్లరి నరేష్, నాగార్జునల పైన డిజైన్ చేసారు. దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం..అంజిది కిష్టయ్యది విడదీయని ఒక బంధం” అనే లిరిక్స్ ఆకట్టుకున్నాయి.

చిరునవ్వులో పూసే స్నేహం..కడతేరని ఆనందంలో..కడదాకా సాగే పయనం..అనే లిరిక్స్ చూస్తేనే నాగార్జున-అల్లరి నరేష్ మధ్య మంచి ఎమోషనల్ బంధాన్ని సినిమాల్లో చూపిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎంత బలంగా ఉంటె..నా సామిరంగ సినిమాకి అంత ప్లస్ అవుతుంది. మరి జనవరి 14న నాగార్జున నా సామిరంగ సినిమా ఆడియన్స్ కు..ఇటు డైరెక్టర్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.

శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.