
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్ చెప్పారని ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు ప్రచురితమైనాయి. 24 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మరో 48 గంటలు ఇదే విధంగా ఉండే అవకాశముందని ఆయన చెప్పారన్నాయి. ఆయన పూర్తిస్థాయిలో ఎప్పుడు రికవరీ అవుతారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే.. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్రంప్ ఓ వీడియో రిలీజ్ చేశారు. త్వరలోనే కోలుకుంటానని ఆయన చెప్పారు. నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ లో ట్రంప్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.