Govinda Komal Rani: గోవిందా జీవితంలో కోమల్ రాణి ఎవరు? భార్య సునీత ఆరోపణలతో బాలీవుడ్లో భారీ ట్విస్ట్!

Govinda Komal Rani: గోవిందా జీవితంలో కోమల్ రాణి ఎవరు? భార్య సునీత ఆరోపణలతో బాలీవుడ్లో భారీ ట్విస్ట్!

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (Govinda) వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నడుస్తున్న వివాదంలో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. తాజాగా గోవిందా భార్య సునీత అహుజా (Sunita Ahuja) చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. నటి కోమల్ రాణితో సీక్రెట్ పెళ్ళికి ప్లాన్ చేశారని సునీత ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. ఇంతకీ డేటింగ్ రూమర్స్‌లో వినిపిస్తున్న కోమల్ రాణి (Komal Rani Swarnakar) ఎవరు? గోవిందాతో సంబంధం ఏంటి? అనే విషయాలు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సునీత

2024 డిసెంబర్‌లో గోవిందాపై సునీత అహుజా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆగస్టు 19న ఆమె ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య వివాదం సద్దుమణిగిందని భావించినప్పటికీ.. ఆ తర్వాత సునీత చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి.

రాఖీ సావంత్‌తో ఫోన్ కాల్‌లో సంచలన నిజాలు..

వివాదాస్పద నటి రాఖీ సావంత్‌తో ఫోన్లో మాట్లాడిన సునీత.. తాను ఎందుకు డైవర్స్ కేసు వెనక్కి తీసుకున్నానో అసలు కారణం బయటపెట్టారు. గోవిందా, నటి కోమల్ రాణి స్వార్ణకర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారని, అందుకే కేసును ఉపసంహరించుకున్నట్లు ఆమె ఆరోపించారు. అంతేకాకుండా కోమల్ రాణిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

రూ.200 కోట్ల ఆస్తిపై నజర్ పెట్టమన్న రాఖీ సావంత్!

ఫోన్ సంభాషణ సందర్భంగా రాఖీ సావంత్ సునీతకు మద్దతుగా నిలుస్తూ ఆసక్తికర సలహా ఇచ్చారని బాలీవుడ్ వర్గాల టాక్. గోవిందాకు ఉన్న రూ. 200 కోట్ల ఆస్తిని ముందుగా మీ పేరు మీదకు మార్చుకోమని, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఆస్తులన్నీ కాజేస్తారని రాఖీ హెచ్చరించినట్లుగా సమచారం.

గోవిందా కౌంటర్ అటాక్..

మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలపై గోవిందా స్పందించారు. సునీత తనపై పబ్లిక్‌గా అనుచిత వ్యాఖ్యలు చేయడం, బూతులు మాట్లాడటం సరికాదని వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరువు బజారున పడేలా వ్యవహరించవద్దని, ఇతరులను కించపరిచేలా మాట్లాడటం తగదని ఆయన హితవు పలికారు.

మొత్తానికి, విడాకుల పిటిషన్‌ను సునీత ఉపసంహరించుకున్నప్పటికీ.. గోవిందా–సునీత మధ్య వివాదం మాత్రం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆరోపణలు, ఇరువురి వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ది.  

కోమల్ రాణి స్వార్ణకర్ ఎవరు?

కోమల్ రాణి స్వార్ణకర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న కొత్తతరం నటి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది.  సోషల్ మీడియాలో మాత్రం కోమల్ యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్లు, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను తరచుగా అభిమానులతో పంచుకుంటోంది. ఆమెకు 15 వేలకుపైగా ఫాలోవర్లు ఉన్నట్లు సమాచారం.

గోవిందాతో కలిసి రెండు సినిమాలు..

2026 జూలైలో గోవిందా తన కొత్త చిత్రం 'రూపా' కోసం కోమల్‌ను మీడియాకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె గోవిందాకు జోడీగా నటిస్తోంది. అంతేకాదు, 'దునియాదారి' అనే మరో చిత్రంలో కూడా గోవిందా–కోమల్ కలిసి నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

డేటింగ్ రూమర్స్ ఎలా మొదలయ్యాయి?

గోవిందా, కోమల్ కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన తర్వాత ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఈ రూమర్స్ మరింత బలపడటానికి గోవిందా భార్య సునీత అహుజా చేసిన వ్యాఖ్యలు కారణమయ్యాయి.