థ్రిల్ చేసేదెవరు..?

 థ్రిల్ చేసేదెవరు..?

జె.డి చక్రవర్తి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘హూ’. శుభ రక్ష,  నిత్య హీరోయిన్స్‌‌. రెడ్డమ్మ బాలాజీ నిర్మిస్తున్నారు. షూటింగ్‌‌తో పాటు  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. రీసెంట్‌‌గా హైదరాబాద్‌‌లోని ప్రసాద్ ల్యాబ్‌‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  

నిర్మాత ప్రసన్న కుమార్, ఆర్టిస్ట్ నాగ  మహేష్  ట్రైలర్ రిలీజ్ చేయగా, నిర్మాతలు ఆచంట గోపీనాథ్, శోభారాణి , ఛాంబర్  వైస్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ పోస్టర్‌‌‌‌ను లాంచ్ చేసి టీమ్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బాలాజీ మాట్లాడుతూ ‘ఇదొక థ్రిల్లర్ మూవీ. జె.డి.చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది. 

ఆయన రీసెంట్‌‌గా చేసిన ‘దయ’ వెబ్ సిరీస్‌‌కి మంచి ఆదరణ దక్కుతోంది. త్వరలోనే తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానున్న మా చిత్రాన్ని కూడా హిట్ చేస్తారని నమ్ముతున్నా’ అన్నారు.